AR Rahman Divorce: 29 ఏళ్ల బంధానికి బ్రేకప్.. భర్తతో విడాకులు ప్రకటించిన ఏఆర్ రెహామాన్ భార్య.. కారణం ఏంటంటే..?

AR Rahman divorce news: ఫెమస్ మ్యూజీక్ మాంత్రికుడు తన భార్యతో విడాకులు తీసుకొనున్నట్లు తెలుస్తొంది. పెళ్లై 29 ఏళ్ల తర్వాత   విడాకులు తీసుకొవడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

1 /6

ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రీటీలు తరచుగా వార్తలలో ఉంటున్నారు. మెయిన్ గా వారి వైవాహిక జీవితం పెళ్లి, ప్రేమ, విడాకులు అన్న అంశాలతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు.

2 /6

ఈ మధ్యకాలంలో మూవీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది దంపతులు విడాకులు తీసుకున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవలోకి మ్యూజీక్ మాస్ట్రో ఏఆర్ రెహామన్ దంపతులు కూడా చేరిపోయారు.

3 /6

మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు.. సైరా తరపున లాయర్.. వందనా షా.. వీరి నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తొంది.  

4 /6

కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు పీక్స్ కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా.. 29 ఏళ్ల తమ వివాహా బంధానికి ముగింపు పలకాలని భావించారంట. ఈ క్రమంలో.. ఏఆర్ రెహామాన్  ఎమోషన్ అయినట్లు తెలుస్తొంది.  

5 /6

తమ మధ్య ఏర్పడిన అగాథం సమసి పోదని, అందుకే విడిపొవడానికి రెడీ అయిపోయినట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో తమ ప్రైవసీని గౌరవించాలని, అండగా ఉండాలని కూడా ఏఆర్ రెహమాన్ అభ్యర్థించినట్లు తెలుస్తొంది.  

6 /6

మరోవైపు.. రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. రెహామాన్ తల్లి ఈ సంబధాన్ని చూసి..అప్పట్లో ఓకే చెప్పారని తెలుస్తొంది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు - ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ అనే కొడుకు. వీరి డైవర్స్ అనౌన్స్ మెంట్ తో అభిమానులు ఒక్కసారిగా మనోవేదనకు గురౌతున్నారంట.