Ashada Amavasya 2024: రేపు కోటి సూర్యగ్రహణాలతో సమానమైన అమావాస్య.. ఈ 5 రాశులకు ఊహించని రాజయోగం..

August 4 Ashada Amavasya 2024: ఆదివారం అమావాస్య రానుంది. ఇది అత్యంత శుభప్రదం. ఆషాఢం ముగియనుంది, ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం రేపు ఆషాఢ బహుళ అమావాస్య. అంతేకాదు ఆదివారం అమావాస్య మంత్ర బలాన్ని పెంచుకునే పుష్యమి నక్షత్ర అమావాస్య.

1 /5

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రేపు ఆషాఢ బహుళ అమావాస్య. అంతేకాదు ఆదివారం అమావాస్య మంత్ర బలాన్ని పెంచుకునే పుష్యమి నక్షత్ర అమావాస్య. ఇది కోటీ సూర్యగ్రహణాలతో సమానం. ఇది 30 ఏళ్లకు ఒకసారి వస్తుంది.  

2 /5

ఇటువంటి తిథుల్లో జపం చేస్తే తప్పకుండా పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలి. వారికి ఇష్టమైన పదార్థాలను దానం చేయాలి. మీరు కూడా గోధుమలతో చేసిన పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.  

3 /5

ముఖ్యంగా మీన, మకర, కుంభ, కర్కాటక రాశివారికి శని ప్రభావం ఉంటుంది. వృశ్చిక రాశికి కూడా అర్థష్టమ శని ప్రభావం ఉంటుంది. ఈ రాశులవారు నల్లనువ్వులు, రాళ్ల ఉప్పు దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు సిద్ధియోగం ఉంటుంది.   

4 /5

ఈరోజు ఎవరికైనా అనారోగ్యం ఉన్నవారికి గొడుగు, చెప్పులు, నల్లనువ్వులు, రాళ్ల ఉప్పు దానం చేయడం వల్ల ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నవాళ్లు కూడా ఆదివారం రోజున తప్పకుండా ధూపం వేయండి. అందులో నాలుగు తెల్ల ఆవాలు కూడా వేయండి.  

5 /5

ముఖ్యంగా రేపు ఆదివారం, అమావాస్యరోజున భార్యభర్తల సంగమం కూడా చేయకూడదు. ఇది అలభ్యతిథి, కేవలం భగవణ్మాన స్మరణ మాత్రమే చేయాలి. సూర్యోదయం ముందే లేచి ఇష్టదైవ నామ స్మరణం చేయాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)