Theppa Samudram: ప్రముఖ ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ 'తెప్ప సముద్రం'..

Theppa Samudram: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్య రావు కథానాయకులుగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’.  కిషోరి దాత్రక్ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. ఇప్పటికే థియోట్రికల్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

1 /5

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి చైతన్య రావు  హీరోలుగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’.సతీష్ రాపోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

2 /5

బేబి వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మైంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేంద్ర గౌత్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. తాజాగా ‘తెప్ప సముద్రం’ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ఆగష్టు 3 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

3 /5

తెలంగాణలోని తెప్ప సముద్రం అనే ఊళ్లో అనుకోకుండా చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తుంటారు.  వారి ఆచూకి కోసం తల్లితండ్రలు ఎంతో అవేధన చెందుతూ ఉంటారు.  ఆ ఊరికి చెందిన  ఎస్.ఐ చిన్న పిల్లల మాయం ఎందుకు అవుతున్నారనే విషయమై ఇన్విష్టిగేషన్ లో ఎలాంటి విషయాలు బయపడ్డాయనేది ఎంతో ఆసక్తి రేకిస్తోంది.

4 /5

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి గ్రిప్సింగ్ త్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాను భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.

5 /5

ఎంగేజింగ్ కంటెంట్ తో అడుగడున ఉత్కంఠ రేకెత్తించే 'తెప్ప సముద్రం' ఈ వీకెండ్ ఆహా ఓటీటీ లో తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఇది ఒకటి.