Astrology: శ్రావణ మాసంలో శని దేవుడి ‘శష రాజ్యయోగం’.. ఈ 4 రాశుల వారికీ అడుగడున విజయాలే..!

Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి పరిభ్రమిస్తుంటాయి. ఆయా గ్రహాలు .. వివిధ రాశుల్లో ప్రవేశించడం వలన వివిధ యోగాలు ఏర్పడుతాయి. ఇక నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. వచ్చే శ్రావణ మాసంలో శని భగవానుడు శశ రాజ్యయోగాన్ని ఇవ్వబోతున్నాడు. దీంతో ఈ నాలుగు వారికి అడుగడు విజయాలే.

1 /6

శనీశ్వరుడు తన స్వంత రాశిలో మకరం, కుంభంలో ఉన్నపుడు మంచి ఫలితాలను అందజేస్తాడు. అంతేకాదు  ఉచ్ఛరాశి అయిన తులా రాశిలో  ఉన్నపుడు.. శష రాజ్యయోగం ఏర్పడుతుంది. జాతకంలో శష రాజయోగం ఏర్పడటం వల్ల జీవితంలో ఎదురైన గండాల బారిన నుంచి పెద్ద ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కెరీర్‌లో అఖండ విజయాలు అందుకునే సాధించే అవకాశాలున్నాయి.

2 /6

శనీశ్వరుడు తన స్వంత రాశిలో మకరం, కుంభంలో ఉన్నపుడు మంచి ఫలితాలను అందజేస్తాడు. అంతేకాదు  ఉచ్ఛరాశి అయిన తులా రాశిలో  ఉన్నపుడు.. శష రాజ్యయోగం ఏర్పడుతుంది. జాతకంలో శష రాజయోగం ఏర్పడటం వల్ల జీవితంలో ఎదురైన గండాల బారిన నుంచి పెద్ద ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కెరీర్‌లో అఖండ విజయాలు అందుకునే సాధించే అవకాశాలున్నాయి.

3 /6

మిథునరాశి: మిథున రాశి వారికి శ్రావణ మాసంలో  శష రాజ్యయోగం వల్ల విశేషమైన ప్రయోజనం  చేకూరబోతుంది.  ప్రతి పనిలో ముఖ్యమైన విజయాలు సాధిస్తారు. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఈ రాశుల వారు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న  కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాదు సంపద, ఆస్తులు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపార పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది. వృత్తిపరమైన ఆటంకాలు తొలగిపోతాయి.

4 /6

మకర రాశి: శ్రావణ మాసంలో శనిదేవుని శష రాజ్య యోగం ఏర్పడడం వల్ల మకరరాశి వారి జీవితాల్లో ఇప్పటి వరకు ఎన్నడు చూడని  సానుకూల మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి బలీయంగా ఉంటుంది. మీరు డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ  వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి.  వ్యాపారం మరియు ఆస్తి సంబంధిత వివాదాలు త్వరలో పరిష్కారమవుతాయి. మెంటల్ గా మీ పరిస్థితి బాగుంటుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

5 /6

కుంభ రాశి : శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో వారికి అనుకూల ఫలితాలను అందిస్తారు. అంతేకాదు ప్రస్తుతం కుంభంలో సంచారం వలన ఈ రాశలు వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు మీ కృషి మరియు అంకితభావానికి తగిన ఫలాలను పొందుతారు. కెరీర్‌ లో కొత్త అవకాశాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

6 /6

మీన రాశి: మీన రాశి రాబేయే శ్రావణ మాసంలో అన్ని శుభాల.  ఈ రాశుల వారిపై  శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. కుటుంబ జీవితంలో ఆనందకరంగా సాగిపోతూ ఉంటుంది. మీరు కెరీర్‌కు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు జీవితంలోని ప్రతి రంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలున్నాయి.  వైవాహిక జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.