ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మరణం ఆస్ట్రేలియా క్రికెట్‌ను విషాదంలో ముంచెత్తింది. బౌలర్‌గా, బ్యాట్స్‌మ్యాన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్లో తనదైన ముద్ర వేసిన సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. సైమండ్స్ మృతి పట్ల పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైమండ్స్ మృతి నేపథ్యంలో క్రికెట్లో అతని బెస్ట్ మూమెంట్స్‌ను మరోసారి గుర్తుచేసుకుందాం...
Andrew Symonds Death: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మరణం ఆస్ట్రేలియా క్రికెట్‌ను విషాదంలో ముంచెత్తింది. బౌలర్‌గా, బ్యాట్స్‌మ్యాన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్లో తనదైన ముద్ర వేసిన సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. సైమండ్స్ మృతి పట్ల పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైమండ్స్ మృతి నేపథ్యంలో క్రికెట్లో అతని బెస్ట్ మూమెంట్స్‌ను మరోసారి గుర్తుచేసుకుందాం...
ఆండ్రూ సైమండ్స్ 2004లో శ్రీలంకతో మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా భావించే యాషెస్ టెస్టు సిరీస్‌లో 2006లో తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లాండుతో జరిగిన ఆ మ్యాచ్‌లో మాథ్యూ హెడెన్‌తో కలిసి 279 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
2003 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా టీమ్‌లో సైమండ్స్ పేరు ఉండటాన్ని చాలామంది విమర్శించారు. అంతకుముందు, చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో సైమండ్స్ కేవలం 69 పరుగులే చేశాడు. ఇలా పూర్ ఫామ్‌లో ఉన్న వ్యక్తిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయడమేంటని క్రికెట్ ఆస్ట్రేలియాను పలువురు తప్పు పట్టారు. అయితే విమర్శకుల నోళ్లు మూయించేలా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సైమండ్స్ సత్తా చాటాడు. 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో 310 స్కోర్ దాకా తీసుకెళ్లాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య 2008లో జరిగిన టెస్టు సిరీస్‌లో సైమండ్స్‌ను అదృష్టం వరించింది. సైమండ్స్ ఔట్ అయినప్పటికీ రెండుసార్లు నాటౌట్‌గా ప్రకటించబడ్డాడు. ఆ టెస్టు మ్యాచ్‌లో సైమండ్స్ 162 పరుగులు చేశాడు.
2005లో మెల్బోర్న్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సైమండ్స్ ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన సైమండ్స్... సెకండ్ ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సులు ఉండటం విశేషం.
2006లో వీబీ సిరీస్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సైమండ్స్ అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియా స్కోర్ 10/3గా ఉన్న దశలో రిక్కీ పాంటింగ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 127 బంతుల్లోనే 151 పరుగులు చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.