బాలీవుడ్ నాటి మేటి నటి , అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి కపూర్ పుట్టినరోజు ఇవాళ. అందుకే ఫ్యాన్స్ ఇవాళంతా ఆమె లేటెస్ట్ లుక్స్‌ని..తల్లి శ్రీదేవితో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. పుట్టినరోజుకు సరిగ్గా ముందు చీరకట్టులో జాహ్నవి కపూర్ కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీదేవిలానే కన్పిస్తోన్న జాహ్నవిని చూడవచ్చు.
బాలీవుడ్ అలనాటి మేటి నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాహ్నవి కపూర్ సోషల్ మీడియాలో ఈ మధ్యన యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు గ్లామరస్, బ్యూటిఫుల్ సెక్సీ ఫోటోల్ని ,డ్యాన్సింగ్ వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తోంది. అందుకే అటు అభిమానులు కూడా జాహ్నవి కపూర్ పోస్ట్‌ల కోసం నిరీక్షిస్తుంటారు. ఇటీవల మరోసారి కతర్నాక్ పోజులతో ఫోటోల్ని షేర్ చేసింది. ఈ పోజుల్లో జాహ్నవి అందంగా..సెక్సీగా..హాట్‌గా కన్పిస్తోంది. తన అప్‌కమింగ్ సినిమా రూహీ ప్రమోషన్‌లో భాగంగా తీసిన ఫోటోలివి. చాలా వైరల్ అవుతున్నాయి. నియోన్ కలర్ డ్రెస్‌లో సోయగాల్ని ప్రదర్శిస్తోన్న జాహ్నవి కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ మీ కోసం..
Janhvi kapoor: జాన్హవి కపూర్..అలనాటి అందాల తార ముద్దుల కుమార్తె. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలు, డ్యాన్సింగ్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తోంది. జాన్హవి కపూర్ పోస్టుల కోసం అభిమానులు సైతం చాలా ఆతృతతో ఎదురుచూస్తుంటారు. ఇటీవల మరోసారి జాన్హవి ఖతర్నాక్ ఫోటోల్ని షేర్ చేసింది. సిల్వర్ డ్రెస్‌తో జిగేల్ మంటోంది. ఫోటో పోజులు చాలా వెరైటీగా..ఆకర్షిస్తున్నాయి.
నేడు అతిలోక సుందరి, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి జయంతి (Sridevi Birth Anniversary)ని పురస్కరించుకుని పెద్ద కూతురు జాన్వీ కపూర్, తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
అలనాటి అందాల తార స్వర్గీయ శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్ తన స్నేహితురాలితో కలిసి సోమవారం వేకువజామున కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్.. నిత్యం ఏదో అంశంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ .. ముంబైలో జరిగిన ఉమంగ్ 2020 ఫెస్టివల్ లో తళుక్కున్న మెరిసింది. ఉమంగ్ 2020 ఫెస్టివల్ కోసం ప్రసిద్ధ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరతో క్రేజీగా కనిపించింది.
"దడక్" చిత్రంతో బాలీవుడ్‌లో ఇప్పటికే తన గ్లామర్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్.. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న "తక్త్ " చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.