Batukamma 2024: రెండో రోజు అటుకుల బతుకమ్మ.. విశిష్టత, నైవేద్యం ఏం పెడతారో తెలుసా?

Atukula Batukamma 2nd Day: బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ ఆడుకుంటారు. రేపు రెండో రోజు బతుకమ్మ పాడ్యమి ఈరోజు శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అటుకుల బతుకమ్మ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
 

1 /7

తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ ప్రారంభమై నేటికి రెండు రోజులు ఈరోజు నిర్వహించుకున్న బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు.  

2 /7

ఈ ఏడాది బతుకమ్మ అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమై 10వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అంటే దసరాకు రెండు రోజులు ముందు.  

3 /7

ఈ 9 రోజులు 9 రకాల బతుకమ్మను తయారు చేస్తారు. ఊరువాడా బతుకమ్మను తయారు చేసి సంబరాలు జరుపుకొంటారు. రంరంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆనందహోలీలో తేలిపోతారు.  

4 /7

రకరకాల పాటలు పాడుతూ బతుకమ్మను ఆడుకుంటారు. ఈ మధ్యకాలంలో కోలాటాలతో కూడా బతుకమ్మను ఆడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో డీజేలు సైతం ఏర్పాటు చేసుకుని సంబరంగా జరుపుకొంటున్నారు.  

5 /7

అయితే, రెండో రోజు ఆశ్వీయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు అటుకుల బతుకమ్మగా జరుపుకొంటారు. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. నైవేధ్యంగా బెల్లం, చప్పడిపప్పు, అటుకులు సమర్పిస్తారు.  

6 /7

ఉదయాన్నే లేచి రంగురంగుల పూలు కోసుకొస్తారు. సాయంత్రం సమయంలో మహిళలందరూ ఆ పూలను గోపురం మాదిరి పేరుస్తారు. ఈ బతుకమ్మతోపాటు గౌరమ్మను తయారు చేస్తారు. ఆడిపాడిన తర్వాత నీళ్లలో నిమజ్జనం చేస్తారు.  

7 /7

ముఖ్యంగా రెండో రోజు అటుకులను వాయినంగా ఇస్తారు. అందుకే దీన్ని అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. అయితే, 9 వ రోజు నిర్వహించుకునే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీన్నే సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు.