Mesha Rasi 2025 To 2026 Telugu Full Prediction: కొన్ని రాశుల వారికి 2025 సంవత్సరం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీరి జాతకం పరంగా జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రహ స్థితులు పరిశీలిస్తే.. నవగ్రహాలు ఈ రాశి వారికి చాలావరకు సహకరించబోతున్నాయి. దీనివల్ల వీరికి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఈ నవగ్రహాల్లో గురువు, శని, రాహు, కేతువులు అత్యంత ప్రధానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు. ఇక రవి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవిధంగా ఉంటుందటువంటి విషయాలను తెలియజేయడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 9 మే వరకు కూడా గురువు గ్రహ ఫలితాలు అందుతాయి.
వీరికి జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి వరకు గురు అనుగ్రహం లభిస్తుంది. అలాగే మార్చి 9వ తేదీన గురు గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు కాబట్టి. రాణి బాకీలు కూడా వసూల్ అవుతాయి. అన్ని పనుల్లో నివాగ్నమైన వారికి ధన పరంగా చాలా వరకు లాభాలు కలుగుతాయి. ఇక మే 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 27 వరకు ఈ గ్రహం మిధున రాశిలోకి సంచారం చేస్తుంది కాబట్టి కాస్త ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సోదరులతో గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాముల మధ్య విభేదాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇక మే 9వ తేదీ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో కొన్ని రాశుల వారికి కాస్త సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో కర్కాటక రాశిలో గురువు అద్భుతమైన స్థానం నుంచి అశుభ స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నవంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు గురువు సాధారణ స్థితిలోకి రాబోతున్నాడు దీనివల్ల వీరికి వస్తున్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 28 మధ్యకాలంలో వీరు నూతన వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా గృహాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఆస్తిపాస్తులు కూడా కూడబెట్టుకుంటారు.
ఇక మేషరాశి వారి విషయానికొస్తే.. 2025 సంవత్సరంలో మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వసతి గృహాలు లేనివారికి ఈ సమయంలో సొంతింటి కల నెరవేరే అవకాశాలు ఉన్నాయి అయితే శని సంచారం వల్ల ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏలినాటి శని మొదలైనప్పటికీ వీరిపై కొన్ని రోజుల వరకు ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు వీరికి విశేషమైన లాభాలు కలుగుతాయి.
ఇక ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొన్ని రోజులపాటు జీవితం ఆడపాదడపా ఉన్నప్పటికీ మళ్లీ అక్టోబర్ 9 వ తేదీన మీనరాశిలో శని గ్రహం సాధారణ స్థితిలోకి రావడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి. ఇక జులై 8 నుంచి శని వక్రీకరించడం వల్ల మళ్లీ వీరికి విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 16 నుంచి జూలై 9 వరకు ఈ రాశి వారు ఏలినాటి శనికి గురవుతారు కాబట్టి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.
ఇక అక్టోబర్ నుంచి జూలై 8వ తేదీ వరకు మేషరాశి వారు ఉద్యోగ మార్పులు చేసుకోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగ మార్పులు చేయడం వల్ల విశేషమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి ఇది యోగ కాలంగా భావించవచ్చు. ఈ సమయం తర్వాత వీరు ఎలాంటి పనులు చేసిన అంతగా లాభాలు పొందకపోవచ్చు. ఇక అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఈ మధ్యకాలం యోగ కాలమని జ్యోతిష్యులు చెబుతున్నారు..
ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. ప్రమోషన్స్ తో బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు కూడా నెరవేరే ఛాన్స్ ఉంది. జనవరి 11 నుంచి మార్చి 13వ తేదీ వరకు వీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా చాలా బాగుంటుంది. సులభంగా విజయాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు కూడా లభించే ఛాన్స్ ఉంది.
ముఖ్యంగా మేష రాశి వారికి 2025 సంవత్సరం అన్ని రంగాలపరంగా చాలా బాగుంటుంది. కాస్త శని ప్రభావానికి గురైనప్పటికీ.. గురు రాహు, కేతువుల కారణంగా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సూపర్ మార్కెట్, కుకింగ్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు ఈ రాశి వారు మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో కాస్త కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.