Waxing Precautions: అమ్మాయిలకు సహజంగానే సౌందర్యంపై మక్కువ ఎక్కువ. ముఖ్యంగా కాళ్లు, చేతులు మరింత అందంగా ఉండాలనుకుంటారు. దీనికోసం పెడిక్యూర్, మెనిక్యూర్‌తో పాటు వ్యాక్సింగ్ చేసుకుంటుంటారు. అయితే వ్యాక్సింగ్ చేసిన తరువాత 5 పొరపాట్లు చేయకూడదని హెచ్చరిస్తున్నారు బ్యుటీషియన్లు. ఆ పొరపాట్లేంటో తెలుసుకుందాం.
వ్యాక్సింగ్ ఎప్పుడు చేయించుకున్నా ఆ ప్రదేశంలో దురద ఉన్నా గోకకూడదు. అలా చేస్తే దురద, రెడ్‌నెస్ సమస్య మరింత పెరిగిపోతుంది.
చాలామందికి వ్యాక్సింగ్ చేయించుకున్న తరువాత చర్మం పాడై కన్పిస్తుంటుంది. అది చూసి కంగారులో కెమికల్ క్రీమ్స్ రాయడం అస్సలు చేయకూడదు. దీనివల్ల చర్మం మరింత పాడవుతుంది.
వ్యాక్సింగ్ చేసిన తరువాత చాలమంది బాడీ స్క్రబ్ చేయిస్తుంటారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. ఇలా చేయడం వల్ల చర్మం పాడవుతుంటుంది. వ్యాక్సింగ్ చేసిన వెంటనే 3-4 రోజుల వరకూ శరీరాన్ని ముట్టుకోకూడదు.
వ్యాక్సింగ్ తరువాత చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఈ తరుణంలో చర్మ సంరక్షణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండలో ఎక్కువగా ఉండకూడదు. వ్యాక్సింగ్ చేసిన చోట చర్మం కమిలిపోవచ్చు. ట్యానింగ్, ర్యాషెస్ సమస్య తలెత్తవచ్చు.
చేతులు, కాళ్లకు వ్యాక్సింగ్ చేసిన తరువాత కేశాల్ని పూర్తిగా తొలగిస్తారు. ఇలా చేసేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సింగ్ తరువాత కొందరి చర్మం నల్లగా మారుతుంటుంది. ఇలా జరగకూడదంటే..వ్యాక్సిన్ చేసిన తరువాత వేడి నీళ్లతో స్నానం చేయకూడదు.