శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఓ గంభీరమైన సమస్యే. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. అందుకే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరిక్ యాసిడ్ సమస్యకు పైనాపిల్ అద్భుతంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం...
Uric Acid Problems: శరీరంలో యూరిక్ యాసిడ్ అనేది ఓ గంభీరమైన సమస్యే. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. అందుకే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరిక్ యాసిడ్ సమస్యకు పైనాపిల్ అద్భుతంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం...
అజీర్తి, గ్యాస్ వేసవిలో కడుపు సంబంధిత సమస్యలు పెరుగుతాయి విరేచనాలు, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు పెరగవచ్చు. పైనాపిల్ తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పైనాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. అందుకే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్ కారణంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి.
ప్యూరిన్ వడపోత పైనాపిల్ జ్యూస్ ఉదయం వేళ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే బ్రోమెలీన్ అనే బయో యాక్టివ్ ఎంజైమ్ వల్ల చాలా లాభాలున్నాయి. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ప్యూరిన్ వడపోతలో ఉపయోగపడుతుంది.
వ్యర్ధాలు శుభ్రపర్చడంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడంలో పైనాపిల్ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే మీ రెగ్యులర్ డైట్‌లో పైనాపిల్ భాగంగా చేసుకోవాలి. శరీరంలో ఆహారం జీర్ణమయ్యా యూరిక్ యాసిడ్ ఉత్పన్నమౌతుంది. అందుకే ఆహారపు ఆలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శరీరంలోని వ్యర్ధాలు, మలినాలను పైనాపిల్ అద్భుతంగా శుభ్రపరుస్తుంది.
పైనాపిల్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించేందుకు పైనాపిల్ జ్యూస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. పైనాపిల్ జ్యూస్ రుచి కూడా బాగుండటంతో తాగేందుకు ఇబ్బంది ఉండదు.