UBL Sensation Decision Beer Supply Suspended In Telangana State: మందుబాబులకు భారీ షాక్ తగిలింది. ఇకపై తెలంగాణలో బీర్లు లభించకపోవచ్చు. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు బీర్ల కంపెనీలు ప్రకటించాయి. అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్ బీర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి. దీంతో తెలంగాణలో బీర్లు అందుబాటులో ఉండవు.
సంక్రాంతి పండుగకు ముందు తెలంగాణ మందుబాబులకు చేదు వార్త ఇది. ఇకపై బీర్ల విక్రయాలు ఉండవు.
తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. ఇకపై తెలంగాణలో బీర్లు విక్రయాలు ఉండకపోవచ్చు.
బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ప్రభుత్వంతో ఏర్పడిన వివాదంతో కంపెనీలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆరు నెలలుగా ఆగిపోయాయి. ఆ బిల్లులకు సంబంధించి ప్రభుత్వాన్ని అడుగుతున్నా విడుదల కావడం లేదు.
రెండు త్రైమాసికాలకు కలిపి దాదాపు రూ.900 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పుడు పండుగ సీజన్‌తో కలిపితే రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందని తెలుస్తోంది.
బిల్లుల విషయంలో చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కంపెనీలు బీర్ల సరఫరాను ఆపివేస్తున్నట్లు ప్రకటించాయని సమాచారం.
బీర్ల సరఫరా నిలిపివేయడం అనేది తాత్కాలికం అని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే శాశ్వతంగా బీర్ల సరఫరా నిలిపివేసే అవకాశం కూడా ఉంది.
బిల్లుల అంశంతోపాటు బీర్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీర్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. 2019-20 నుంచి ఇప్పటివరకు బీర్ల ధరలు పెంచుకోవడానికి తెలంగాణ బేవరేజెస్ అనుమతించడం లేదు. దీనిపై యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ కంపెనీ ఆగ్రహంతో ఉంది.