LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు భారీ షాక్‌.. వరుసగా రెండోసారి పెరిగిన సిలిండర్‌ ధరలు..ఎంతంటే?

LPG Cylinder Prices Hike: ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు భారీ షాక్‌. సిలిండర్‌ ధరలు భారీగా పెంచేశాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు ఏకంగా రూ.39 పెంచేశాయి. ఈ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.  ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ప్రతి నెల ఒకటవ తేదీ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ల్లో మార్పులును చేస్తుంది. 2024 సెప్టెంబర్‌ 1వ తేదీన 19 కేజీల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరలను రూ.39 పెంచేశాయి. దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు రూ.1691.50. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్​లో రూ.855, విశాఖపట్నంలో రూ.812 ఉన్నాయి.  

2 /5

గత నెలలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గుతూ వచ్చాయి. జూలై నెలలో రూ.30 తగ్గింది. జూన్‌ రూ. 69.50, మే నెలలలో రూ.19 తగ్గుతూ వచ్చాయి. కానీ, రెండు నెలలుగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరుగుతూ వచ్చాయి.జూన్‌ 1వ తేదీ నాటికి ఈ గ్యాస్‌ ధరలు రూ.1,676 ఉండేవి. అతి తక్కువ సమయంలో భారీగా గ్యాస్‌ ధరలు పెరిగిపోయాయి.  

3 /5

ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలను తరచూ మార్పులు చేస్తాయి. ఇది ముఖ్యంగా వివిధ వాణిజ్య కారకాలను ఆధారపడి నిర్ణయిస్తారు. అయితే, తాజాగా పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలకు అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ఇది అంతర్జాతీయ ఆయిల్‌ ధరలు, దేశీ పన్ను పాలసీ, డిమాండ్‌ సప్లై వ్యత్యాసం ఆధారంగా నిర్ణయించి ఉండొచ్చు.  

4 /5

పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ భారీగా వినియోగించే వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటల్లు, చిన్న పరిశ్రమలు ఈ ధరలు పెను భారంగా మారనున్నాయి.  

5 /5

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా  అతి తక్కువ ధరలక మహిళలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అర్హులైన కుటుంబాలకు జీవనప్రామాణాలు పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.