కుట్ర రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని దీటుగా ఎదుర్కొని దుబ్బాక ఉప ఎన్నికల్లో జయకేతనం (Raghunandan rao wins Dubbaka Bypolls) ఎగరేసిన బిజెపి అభ్యర్థి ఎం.రఘునందన్ రావుకు హృదయపూర్వక శుభాభినందనలు అని బీజేపీ తెలంగాణ తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల (Dubbaka Bypoll Results)లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు 1118 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డిపై విజయం సాధించారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్తి రఘునందన్ రావుకి 63,140 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 62వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.
‘దుబ్బాకలో టీఆర్ఎస్ దుబ్బ పాలైంది తెరాస ప్రభుత్వానికి ప్రజలు చెక్కు పెట్టారు. తెలంగాణ లో నూతన అధ్యాయం ప్రారంభము. దుబ్బాకలో బిజెపి అభ్యర్థి ని గెలిపించిన ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని మురళీధర్ రావు ట్వీట్ చేశారు
‘దుబ్బాక లో బీజేపీ గెలుపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక నూతన మలుపు. టీఆర్ఎస్ పతనానికి దుబ్బాకలో బీజేపీ గెలుపు ఇది నాంది కాబోతుంది. రఘునందన్ రావు కు నా హృదయపూర్వక అభినందనలు’ అని బీజేపీ నేత లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
తెరాస తప్పులను బహిర్గతం చేయడానికి, అన్యాయాలపై పోరాడటానికి మేము ఇక్కడ ఉన్నామని రఘునందన్ రావు, భాజపా కార్యకర్తలు నిరూపించారు. దుబ్బాకలో బిజెపి విజయం, తెలంగాణలో ‘ధర్మ స్థాపన’కు, సుపరిపాలనకు నాంది.
దుబ్బాక నుంచి బీజేపీ ఘంటారావం మోగించిందని ఆ పార్టీ కీలక నేత డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజలు అధికార మార్పు కావాలని కోరుకుంటున్నారని స్పష్టమైందన్నారు.