Boxing Day 2024: డిసెంబర్‌ 26 'బాక్సింగ్‌ డే' ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు జరుపుకుంటారు తెలుసా?

Boxing Day 2024 Significance: 'బాక్సింగ్‌ డే' క్రిస్మస్‌ మరుసటి రోజు జరుపుకుంటారు. ప్రతి ఏడాది డిసెంబర్‌ 26వ తేదీ బాక్సింగ్‌ డే ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా సెలవు దినంగా ప్రకటిస్తారు. ముఖ్యంగా పేదవారికి గిఫ్ట్‌లు ఇచ్చేందుకు మొదట్లో ప్రారభమైంది. ఇప్పుడు ఇది షాపింగ్‌ హాలిడేగా కూడా మారింది. 
 

1 /5

క్రిస్మస్‌ మరుసటిరోజు  కొన్ని దేశాల్లో ఈ వేడుక జరుపుకునేవారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు. యూకే, స్కాట్‌ల్యాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రీయా,న్యూజీలాండ్, కెనడా దేశాల్లో బాక్సిండే రోజు పబ్లిక్‌ హాలిడేగా ప్రకటిస్తారు. ఈరోజు బ్యాంకులకు కూడా సెలవు. 'బాక్సింగ్‌ డే' 1871 నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారు.  

2 /5

డిసెంబర్‌ 26వ తేదీ బాక్సింగ్‌ డే నిర్వహిస్తారు. అయితే, ఈ బాక్సింగ్‌ డే ఒకవేళ శనివారం వచ్చిందంటే ఆ తర్వాత వెంటనే వచ్చే  సోమవారం ఈ వేడుకను జరుపుకునే సంప్రదాయం ఉంది. ఒకవేళ డిసెంబర్‌ 26 ఆదివారం వచ్చిందంటే దాన్ని మరుసటి మంగళవారం జరుపుకుంటారు.  

3 /5

'బాక్సింగ్‌ డే' 1833 నుంచి నిర్వహించడం మొదలైంది. అయితే ఎవరు ప్రారంభించారనేది అధికారికంగా ప్రకటించలేదు.  ఇది బహుమతుల హాలిడే అని పిలువడం ప్రారంభమైంది. ఉద్యోగుల తమ సూపీరియర్స్‌ నుంచి బహుమతులు పొందుతారు. ఇంటి పనివారికి కూడా గిఫ్ట్‌లు ఇస్తారు. బాక్సింగ్ డే రోజు వారి కుటుంబాల వద్దకు వెళ్లి ఈ గిఫ్టులను వారికి కూడా అందిస్తారు.   

4 /5

మరికొన్ని ప్రదేశాల్లో గిఫ్టుల బాక్సులను చర్చీలో ప్రార్ధనల సమయంలో క్రిస్మస్‌ రోజు పెట్టి మరుసటి రోజు వాటిని ఓపెన్‌ చేస్తారు. అంతేకాదు ఈరోజు బేక్‌ చేసిన కేక్‌, ఫుడ్స్‌తో కుటుంబంతో కలిసి జరుపుకుంటారు. వారితో ఎంజాయ్‌ చేస్తారు. బాక్సింగ్‌ డే అంటే బ్లాక్‌ ఫ్రై డే లాంటిది. థ్యాంక్స్‌ గివింగ్‌ మరుసటి రోజు యూఎస్‌ లో జరుపుతారు.  

5 /5

ఇది కాకుండా బాక్సింగ్‌ డే అంటే క్రీడలను తిలకించే రోజుగా కూడా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, సౌత్‌ ఆఫ్రికా, ఆస్ట్రీయా దేశాల్లో క్రికెట్‌ చూస్తారు అంతేకాదు ఐస్‌ హాకీ,  హార్స్‌ రేసులు కూడా నిర్వహిస్తారు. డిసెంబర్‌ 26న రెడ్‌ బాల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ కూడా ఆడతారు. ఆస్ట్రీయా ఐకానిక్‌ స్టేడియం మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తారు.