Under Rs 5 Lakhs Best Buying Cars: దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, భారతీయ కార్ల మార్కెట్లో ఇప్పటికీ మీ కోసం కొన్ని సరసమైన కార్లు ఉన్నాయి. మీరు ఈ దీపావళికి రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు కారు కోసం చూస్తున్నట్లయితే, మీ కోసం ఒకటి కాదు, రెండు కాదు, 5 అత్యుత్తమ కార్ల వివరాలను తెలుసుకోండి.
మారుతి ఆల్టో: మారుతి ఆల్టో కొత్త వేరియంట్ మారుతి సుజుకి ఆల్టో కే10 దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. రూ.5 లక్షల కంటే తక్కువ ధరకే ఈ కారును కొనుగోలు చేయవచ్చు. మారుతి ఈ కారును రూ.3.99 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరకు విక్రయిస్తోంది. ఈ కారు ఇంజన్ 998 సీసీ, పవర్ 55.92 - 65.71 బీహెచ్‌పీ పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లలో లభిస్తుంది.
మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో: భారతీయ మార్కెట్‌లో మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షలు. 998 సీసీ 3 సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 55.92 - 65.71 బీహెచ్‌పీ పవర్, 82.1 ఎన్ఎమ్ - 89 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్‌లో పెట్రోల్, సీఎన్‌జీలో అందుబాటులో ఉన్నాయి.
రెనాల్ట్ క్విడ్: రూ.5 లక్షలలోపు లభించే కార్లలో రెనాల్ట్ క్విడ్ ఒకటి. రెనాల్ట్ క్విడ్ ఇన్ కారులో 999 సీసీ 3-సిలిండర్ ఇంజన్. ఇది 67.06 బీహెచ్‌పీ పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. రెనాల్ట్ క్విడ్‌ను రూ.4.69 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
మారుతి సెలెరియో: మారుతి సుజుకి సెలెరియో 8 వేరియంట్లలో బడ్జెట్ కస్టమర్లను ఆకట్టుకునే మోడల్ ఇది. మారుతి సెలెరియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.37 లక్షలు. కానీ రూ.4.99 లక్షల తగ్గింపు ధరకు విక్రయిస్తున్నారు. 998 సీసీ 3-సిలిండర్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 బీహెచ్‌పీల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 35 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంక్ ఉంది. పెట్రోల్, సీఎన్‌జీ అందుబాటులో ఉన్నాయి.
ఎంజీ కామెట్ ఈవీ: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీ. బడ్జెట్ ధరలో.. డిజైన్ సరికొత్తగా.. ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంజీ మోటార్స్ కామెట్ ఈవీ కారు కేవలం రూ.4.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకే విక్రయిస్తోంది. ఇందులో 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కి.మీ ప్రయాణం చేస్తుంది.