BSNL Recharge Offers: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్‌ల ధరలను భారీగా పెంచడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రత్యామ్నయం లేకపోవడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో అదే సిమ్‌లను వినియోగించాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ టెలికాం సంస్థ త్వరలోనే 4G సేవలను ప్రారంభించనుంది. దీంతో పెద్ద ఎత్తున ఎక్కువ మంది వినియోదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌లను తక్కువ ధరకే ప్రకటిస్తోంది. 395 రోజుల పాటు పనిచేసే ప్రత్యేక ప్లాన్‌ను ప్రారంభించింది.
ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ధర 2,399 రూపాయలుగా నిర్ణయించింది.
అంటే ప్రతి నెలా దాదాపు రూ.185 ఈ ప్లాన్ కోసం ఖర్చవుతుంది. ఈ ప్లాన్‌లో డైలీ 2 GB హై స్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది.
ఇది కాకుండా ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ కూడా ఉంది. జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్‌లు, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్‌ఆన్ ఆస్ట్రో టేల్ వంటి అనేక బెనిఫిట్స్‌ను ఈ ప్లాన్ ద్వారా పొందొచ్చు.
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీసెంట్‌గా తమ ప్లాన్ ధరలను పెంచడంతో వినియోగదారులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
అందుకే ఎక్కువ మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అవుతున్నట్లు సమాచారం. ఈ సమయంలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభిస్తే ఎక్కువ మంది అటువైపు మారిపోయే అవకాశం ఉంది.