Catering business ideas 2024: కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచిస్తున్నారా..? చిన్న పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే బిజినెస్‌లు ఎన్నో ఉన్నాయి. కేవలం రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి నెలకు రూ. లక్షలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
Catering Business Ideas 2024: పెళ్లి, పండుగలు ఇతర ఫంక్షన్లలో క్యాటరింగ్ సర్వీసులు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇది సమయం ఆదా చేయడమే కాకుండా, కార్యక్రమాలను మరింత ప్రత్యేకంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని,మీరు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి.. దీని ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది తెలుసుకుందాం.
క్యాటరింగ్ అంటే పెళ్లిళ్లు, పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్లు వంటి వివిధ రకాల కార్యక్రమాలకు ఆహారం సిద్ధం చేసి అందించే వ్యాపారం. ఇందులో భాగంగా మెను రూపకల్పన, ఆహారం సిద్ధం చేయడం, వడ్డించడం, అలంకరించడం వంటి అన్ని పనులు చేస్తారు.
క్యాటరింగ్ సర్వీసుల వల్ల వంట చేయడానికి, వడ్డించడానికి వెచ్చించే సమయం ఆదా అవుతుంది. క్యాటరింగ్ కంపెనీలు వివిధ రకాల ఆహారాలను అందిస్తాయి. దీని వల్ల కస్టమర్లు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు.
ఒకవేళ ఫ్యాన్సీ స్టైల్ క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటే కేవలం రూ. 30,000 నుంచి రూ. 80,000 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఈ బిజినెస్ ఇంట్లో నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు ప్రధాన మంత్రి ముద్ర యోజనలో లోన్ తీసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణం కోసం ఎలాంటి కాలేజీ లేదా ఆస్తి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈ పథకం డబ్బులతో కిచెన్ వస్తువులు, పాత్రలు, వాహనం, లైసెన్సులు మొదలైన వాటి కోసం ఉపయోగించుకోవచ్చు. మీ వ్యాపారాన్ని రక్షించడానికి బీమా చేయించుకోవడం చాలా ముఖ్యం.
ఈ బిజినెస్‌తో నెలలో లక్షలో ఆదాయం పొందవచ్చు. ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన ముందుగా మీ ప్రత్యేకత, బిజినెస్ స్కిల్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీని బట్టి వ్యాపారం మరింత జోరుగా సాగుతుంది.