Harmful Drinks: కాఫీ అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం. ఇందులో ఉండే కెఫీన్ కారణంగా మెదడు ఉత్తేజితమౌతుంది. అదే సమయంలో హాని కూడా కల్గిస్తుంది. కెఫీన్ ఆధారిత ఉత్పత్తులు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఇవి తాగినంతసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండవచ్చు కానీ కాఫీ ఆధారిత ఈ 5 ఉత్పత్తులు తాగడం వల్ల గుండె పోటు వ్యాధుల ముప్పు అధికమౌతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
సోడా డ్రింక్స్ సోడా ఆధారిత కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ చాలా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. దురదృష్టవశాత్తూ పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా ఇష్టంగా సేవిస్తుంటారు. ఇక పంచదారతో కెఫీన్ కలవడం వల్ల అది కాస్తా మధుమేహం, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులకు కారణమౌతుంది

టీ మనదేశంలో కోట్లాదిమంది దినచర్య టీతో ప్రారంభమౌతుంది. ఈ దేశంలో నీళ్ల తరువాత ఎక్కువగా తాగేది ఇదే. అందుకే హార్ట్ ఎటాక్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక కప్పు టీలో 14 నుంచి 60 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది.
కాఫీ ఇళ్లు, ఆఫీసు, స్నేహితులతో ఎప్పటికప్పుడు కాఫీ తాగడం చాలామందికి అలవాటు. ఇందులో కెఫీన్ పెద్దమొత్తంలో ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీర్ఘకాలంలో హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు చుట్టుముడుతాయి. ఒక కప్పు కాఫీలో 60 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది.
గ్వారానా డ్రింక్స్ గ్వారానా డ్రింక్స్ అనేది విత్తనంతో తయారవుతుంది. దక్షిణ అమెరికాలోని అమెజాన్ ప్రాంతంలో లభిస్తుంది. ఇందులో ఉండే కెఫీన్ కారణంగా హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది.