మూడోసారి అధికారంలోకి రాబోతున్నాం: కేజ్రీవాల్

Feb 8, 2020, 11:50 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జోరందుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీల మధ్య పొలిటికల్ వార్‌కు నేడు ముఖ్య ఘట్టం. శనివారం ఉదయం 8 గంటలకు 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

1/5

కుటుంబంతో పాటుగా కేజ్రీవాల్

Arvind Kejriwal casts his vote

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సివిల్ లైన్స్ పోలింగ్ బూత్‌కు వెళ్లిన కేజ్రీవాల్.. కుటుంబంతో కలిసి పోలింగ్‌లో పాల్గొన్నారు. కేజ్రీవాల్ కుమారుడు తొలిసారి ఓటు హక్కు వినియోగించున్నాడు. ఫొటోలో కూతురు లేకపోవడంతో.. సీఎంగారు మీ కూతురు ఓటు వేయలేదా అని కేజ్రీవాల్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగారని తెలిసిందే. అదే స్థానం నుంచి బీజేపీ తరఫున సునీల్ యాదవ్, కాంగ్రస్ అభ్యర్థిగా రొమేష్ సబర్వాల్ సీఎం కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్నారు.

2/5

ఆప్ విజయం తథ్యం

CM-Kejriwal-casts-vote

ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు కచ్చితంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. చేసిన పనిని గమనించి ఢిల్లీ ఓటర్లు జాగ్రత్తగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆప్ మూడోసారి అధికారం చేపట్టనుందని ధీమా వ్యక్తం చేశారు.

3/5

మనీష్ సిసోడియా

Delhi Deputy CM Manish Sisodia casts his vite

పాండవ్ నగర్‌లోని ఎంసీడీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఆయనతో పాటు భార్య సీమా సిసోడియా తన విలువైన ఓటు వేసి ఢిల్లీ ఓటింగ్‌లో భాగస్వాములయ్యారు. పట్‌పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి సిసోడియా పోటీ చేశారు.

4/5

తండ్రి ఆశీర్వాదం తీసుకుంటున్న కేజ్రీవాల్

Arvind-Kejriwal

ఓటేయడానికి ఇంటి నుంచి బయలుదేరేముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రజల ఆశీర్వాద బలం కూడా తనకే ఉందని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

5/5

తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న కేజ్రీవాల్

CM-Kejriwal

ఓటేయడానికి ఇంటి నుంచి బయలుదేరేముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

తదుపరి ఆల్బమ్