Vikkatakavi: తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్‌పుట్.. ఎలానో చెప్పేసిన వికటకవి ఫ్యాషన్ డిజైనర్ గాయత్రి దేవి

Vikkatavkavi webseries: ఓటీటీలో ఈమధ్య వైవిద్యమైన కథలతో వస్తోన్న వెబ్ సిరీస్.. మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇదే ఫాలో అవుతూ వచ్చిన వికటకవి కూడా.. ప్రేక్షకు ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలో ఈ సిరీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన జోశ్యుల గాయత్రి  తన లైఫ్ జర్నీ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చి అందరినీ ఆకట్టుకుంది.

1 /6

వెబ్ సిరీస్‌లకు పనిచేయడం ద్వారా యువ ప్రతిభావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయని కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి.. తెలిపారు. తాజాగా జీ5లో ప్రసారం అవుతోన్న వికటకవి వెబ్ సిరీస్‌కు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సిరీస్ నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో, ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రూపొందించబడింది.  

2 /6

జాయంట్లలో పనిచేసిన గాయత్రి దేవి, వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగాన్ని వదిలి, ఫ్యాషన్ డిజైనింగ్‌ను ప్రారంభించారు. "బోటిక్ బిజినెస్ ప్రారంభించేందుకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. ఈ ప్రయాణంలో ఫ్యాబ్రిక్ ఎంపిక నుంచి డిజైన్ పూర్తయ్యేవరకు ప్రతిదీ నేర్చుకున్నాను. 2019 వరకు బిజినెస్ బాగా సాగింది, కానీ కోవిడ్ కారణంగా ఆగింది. ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో పునఃప్రారంభించాలనుకుంటున్నాను," అని ఆమె చెప్పారు.  

3 /6

"ఇతర డిజైనర్లు నా వద్ద స్టిచింగ్ చేయించుకోవడం మొదలైంది. అలా వెబ్ సిరీస్ కుడిఎడమైతే ద్వారా నా కెరీర్ ప్రారంభమైంది," అని తెలిపారు. పలు ప్రాజెక్టులు, పీరియాడిక్ సిరీస్‌లకు ఆమె పనిచేశారు. "పీరియాడిక్ సిరీస్‌లకు పనిచేయడం ప్రత్యేక అనుభవం. తక్కువ బడ్జెట్, ఎక్కువ అవుట్‌పుట్ ఇవ్వడం పెద్ద సవాలు," అన్నారు.  

4 /6

"వికటకవి తెలంగాణ నేపథ్యంలో రూపొందించబడింది. 1940ల హైదరాబాదును ప్రతిబింబించేందుకు ‘మాభూమి’ సినిమా, పలు ఆర్టికల్స్ ద్వారా రీసెర్చ్ చేశాను. కథకు అనుగుణంగా ఫ్యాబ్రిక్ ఎంపిక, లుక్ టెస్టులు నిర్వహించాం. మేఘా ఆకాష్‌కి చీరలు బాగా సరిపోయాయి," అని వివరించారు.

5 /6

"ఫ్యాబ్రిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. కథకు తగిన మూడ్ కోసం.. ఫ్యాబ్రిక్స్‌ను మార్చాం. తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్‌పుట్ ఇవ్వడం చాలెంజింగ్‌గా అనిపించింది," అని అన్నారు.  

6 /6

ప్రస్తుతం "సతీష్ వేగేశ్న దర్శకత్వంలో.. మర్మయోగి వెబ్ సిరీస్, మానసచోర సినిమాలకు పని చేస్తున్నాను," అని గాయత్రి దేవి తెలిపారు.