Crack Heel Remedy: పగిలిన మడమలను అందంగా ఉంచుకోవాలంటే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి..

Crack Heel Remedy: పగిలిన మడమలు చాలామంది మహిళలను ఈ సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు కూడా పాదాలు పొడిబారటం ఇలా పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. దీనికి అనేక ఉత్పత్తులు వాడినా సరైన ఫలితాలు లభించవు.
 

1 /5

అయితే, కొన్ని రకాల హోం రెమిడీలు ప్రయత్నిస్తే పాదాల పగుళ్లకు తక్షణమే చెక్‌ పెడుతుంది. ముఖ్యంగా గ్లిజరిన్‌ ఇది సౌందర్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్లిజరిన్‌ పాదాల పగుళ్లకు మంచి రెమిడీ దీన్ని ఎలా ప్రయత్నించాలో తెలుసుకుందాం.  

2 /5

పాదాల పగుళ్లపై గ్లిజరిన్ ఉపయోగించడం వల్ల అవి నయం అయిపోతాయి. గ్లిజరిన్‌ తో మిశ్రమం తయారు చేసుకోవాలి. ముఖ్యంగా గ్లిజరిన్‌, రోజ్‌ వాటర్‌ కలిపి మీ పగిలిన పాదాలకు అప్లై చేయండి. ఓ అరగంట తర్వాత కడగాలి ఇలా చేస్తే పాదాలు అందంగా మారతాయి.  

3 /5

పాదాల పగుళ్లకు గ్లిజరిన్‌ ఎఫెక్టీవ్‌ రెమిడీ. ఇది కాళ్లను తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఇది పాదాల పగుళ్లకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో మృదువుగా మారిపోతాయి..  

4 /5

సౌందర్యపరంగా తేనె కూడా ప్రభావవంతమైన రెమిడీ. దీంతో కూడా మీ పాదాలు మృదువుగా మారతాయి. తేనె ను నేచురల్‌ మాయిశ్చరైజర్‌గా పరిగణిస్తారు. తేనెను పగిలిన పాదాలకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.  

5 /5

ముందుగా పాదాలను శుభ్రంగా కడగాలి ఆ తర్వాత కొన్ని గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అందులో తేనె కలపాలి. ఆ తర్వాత కాసేపటి వరకు కాళ్లను అందులో పెట్టాలి. ఓ అరగంట తర్వాత కాళ్లను శుభ్రం చేయండి. దీంతో మీ పాదాలు తేమను నిలుపుకుంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )