Cyber Frauds: ఆటో పే ఆప్షన్లతో జాగ్రత్త, సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలు ఎలా జరుగుతాయంటే

సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపం దాలుస్తున్నాయి. ప్రజల ఎక్కౌంట్లు ఖాళీ చేసేందుకు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఎప్పుడు ఏ రూపంలో సైబర్ మోసాలు జరుగుతాయో అంచనా వేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు కొత్తగా ఆటో పే ఆప్షన్‌తో మోసాలు వెలుగు చూస్తున్నాయి. అసలీ ఆటో పే మోసాలు ఎలా జరుగుతాయో పూర్తిగా తెలుసుకుంటే మంచిది. తద్వారా అప్రమత్తంగా ఉండవచ్చు. 

Cyber Frauds: సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపం దాలుస్తున్నాయి. ప్రజల ఎక్కౌంట్లు ఖాళీ చేసేందుకు కొత్త కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఎప్పుడు ఏ రూపంలో సైబర్ మోసాలు జరుగుతాయో అంచనా వేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు కొత్తగా ఆటో పే ఆప్షన్‌తో మోసాలు వెలుగు చూస్తున్నాయి. అసలీ ఆటో పే మోసాలు ఎలా జరుగుతాయో పూర్తిగా తెలుసుకుంటే మంచిది. తద్వారా అప్రమత్తంగా ఉండవచ్చు. 

1 /6

మనం చేసే వివిధ రకాల పేమెంట్స్ తేదీలు గుర్తుంచుకోవడం కష్టం. అందుకే ఆటో పే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఒకసారి సెట్ చేసుకుంటే ఆ తేదీ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరిగిపోతుంటాయి. సరిగ్గా ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఎక్కౌంట్లు ఖాళీ చేస్తున్నారు. 

2 /6

మనం సాధారణంగా ఓటీటీ వంటి చెల్లింపులకు ఆటో పే ఆప్షన్ ఉపయోగిస్తుంటాం. ఇలాంటివారికి ఈ నెల ఆటో పే ద్వారా డబ్బులు చెల్లించమంటూ సైబర్ నేరగాళ్లు మెస్సేజ్ పంపిస్తారు. మీరు ఆ మెస్సేజ్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేస్తే మోసపోయినట్టే.

3 /6

అంటే ఉదాహరణకు ఓ ఓటీటీ యాప్‌కు ప్రతి నెలా డబ్బులు ఆటో పే ద్వారా చెల్లిస్తున్నారు. ఇది తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు బిల్లు చెల్లించమని ఆటో పే మెస్సేజ్ పంపిస్తారు. మీరు ఇప్పటికే ఆటో పే ద్వారా చెల్లింపు చేస్తున్నందుకు మీకు అనుమానం రాకపోవచ్చు. నిజమేననుకుని యాక్సెప్ట్ చేస్తారు. అంతే మీ ఎక్కౌంట్ సైబర్ నేరగాడి ఆధీనంలో వెళ్లిపోతుంది. 

4 /6

అందుకే ఆటో పే ఆప్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మీరు ఆటో పే ఆప్షన్ సెట్ చేసుకున్న తరువాత తిరిగి ఎలాంటి మెస్సేజ్‌లు రావని గుర్తుంచుకోండి. ఒకవేళ వచ్చాయంటే అనుమానించి అప్రమత్తం కావాలి. లేదా సంబంధిత బ్యాంకు లేదా ఓటీటీ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. 

5 /6

చాలామంది ఫోన్ నెంబర్లనే యూపీఐ ఐడీలుగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటివాళ్లు సులభంగా మోసపోవచ్చు. అందుకే యూపీఐ ఐడీగా ఫోన్ నెంబర్ వాడవద్దు. ఆటో పే విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. 

6 /6

ప్రైమరీ బ్యాంకు ఖాతాను యూపీఐకు లింక్ చేయకుండా ఉంటే చాలా మంచిది. అంటే యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు ప్రత్యామ్నాయ ఎక్కౌంట్ ఉంచుకుని అందులో తక్కువ డబ్బులు నిల్వ ఉండేలా చూసుకుంటే బెటర్. యూపీఐ పిన్ నాలుగు అంకెలు కాకుండా 6 అంకెలు ఉండేట్టు చూసుకోండి