Diabetes Precautions: షుగర్ రోగులకు శత్రువు కంటే ప్రమాదకరం ఈ 5 ఫ్రూట్స్

సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ డయాబెటిస్ రోగుల విషయంలో మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. అన్ని పండ్లు డయాబెటిస్ రోగులకు ఆమోదయోగ్యం కాదు. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలి. అందుకే ఈ 5 పండ్లను డయాబెటిస్ రోగులకు శత్రువుగా పరిగణిస్తారు.

Diabetes Precautions: సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ డయాబెటిస్ రోగుల విషయంలో మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. అన్ని పండ్లు డయాబెటిస్ రోగులకు ఆమోదయోగ్యం కాదు. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలి. అందుకే ఈ 5 పండ్లను డయాబెటిస్ రోగులకు శత్రువుగా పరిగణిస్తారు.
 

1 /5

పైనాపిల్ పైనాపిల్ చాలా స్వీట్‌గా ఉంటుంది. అందరూ ఇష్టపడుతుంటారు. ఇందులో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ. అందుకే డయాబెటిస్ రోగులు తినకూడదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. 

2 /5

లీచి లీచి అత్యంత ఆరోగ్యకరమైన ఫ్రూట్. ఇది బీహార్‌లోని ముజఫ్ఫర్ పూర్ జిల్లాలో అధికంగా ఉంటుంది. డయాబెటిస్ రోగులకు ఈ ఫ్రూట్ మంచిది కాదు. ఇందులో నేచురల్ షుగర్ అధికంగా ఉండటమే కాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ.

3 /5

ద్రాక్ష డయాబెటిస్ రోగులు ద్రాక్ష పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నల్ల ద్రాక్ష, గ్రీన్ ద్రాక్ష రెండింటికీ పెద్దగా తేడా లేదు.

4 /5

అరటి పండ్లు అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తాయి. అయితే మధుమేహం రోగులు మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ. డయాబెటిక్ రోగులకు మంచిది కాదు.

5 /5

మామిడి మామిడిని పండ్ల రారాజుగా పిలుస్తారు. మామిడి అంటే ఇష్టపడనివారుండరు. అంత అద్భుతంగా ఉంటుంది. కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్న రోగులు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. మలబద్ధకం, బ్లడ్ షుగర్ లెవెల్స్ సమస్య పెరుగుతుంది.