Allu Arjun Emotional Inquiry: చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ని దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించగా.. ఆ ప్రశ్నలతో అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు ఎంక్వయిరీలో ఏమి జరిగింది.. అల్లు అర్జున్ ఈ ఎంక్వైరీలో ఏడ్చారా..?అనేది ఒకసారి చూద్దాం
గత కొంతకాలంగా అల్లు అర్జున్ జీవితంలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి, అల్లు అర్జున్ కి మధ్య ఒక విధమైనటువంటి యుద్ధమే జరుగుతోంది. పుష్ప 2 సినీమా రిలీజ్ సమయంలో తన కుటుంబంతో కలిసి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాకుండా ఆమె కుమారుడు కూడా గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం పైన అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. అరెస్ట్ అయి.. బెయిల్ మీద బయటకు వచ్చారు. దీనికి తోడు నిన్న కేసులో విచారణ నిర్వహించారు చిక్కడపల్లి పోలీసులు. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి.
నిన్నటి రోజున అల్లు అర్జున్ ని కొంతమంది అధికారులు మూడున్నర గంటల పాటు విచారించారు. ముఖ్యంగా కొన్ని వీడియోలు, ఫోటోలను సైతం చూపిస్తూ అల్లు అర్జున్ ను విచారణ చేసినట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అలాగే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భాగంగా ఏకంగా 18 ప్రశ్నలు అడగగా.. అల్లు అర్జున్ చాలా బాగోద్వేగానికి లోనయ్యారని దీంతో ఏడ్చేశారన్నట్లుగా కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి.
అయితే ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ విచారణ తర్వాత బయటికి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ వచ్చిన విధానాన్ని బట్టి ఈ రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే అభిమానులు మాత్రం ఈ విషయం పైన ఇవన్నీ కూడా కేవలం ఊహాగానాలని .. అసలు అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేశారు? అల్లు అర్జున్ ఏ విధంగా సమాధానాలు చెప్పారు? అనే విషయం వారు చెప్పాల్సిందే తప్ప ఎవరికీ తెలియదు అంటూ ఈ విషయాలను కొట్టి పారేస్తున్నారు.
మరి రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఈ కేసులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడిగా ఉన్న బౌన్సర్ ఆంటోనీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.