Drinking Water At right Time:నీళ్లు మనం జీవించాలంటే ఎంతో ముఖ్యం. ఇది లేకుండా శరీరక్రియలకు బ్రేక్ పడుతుంది. సాధారణంగా ప్రతిరోజూ కనీసం 5 లీటర్ల నీళ్లైనా తాగాలి అంటారు.
నీళ్లు మనం జీవించాలంటే ఎంతో ముఖ్యం. ఇది లేకుండా శరీరక్రియలకు బ్రేక్ పడుతుంది. సాధారణంగా ప్రతిరోజూ కనీసం 5 లీటర్ల నీళ్లైనా తాగాలి అంటారు. ఇది శరీర జీర్ణక్రియకు ఎంతో అవసరం. సరిగ్గా నీరు తీసుకోకపోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తప్పవు. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అయితే, మనం ఏదైనా తిన్నాక నీరు తాగుతాం.కానీ, నీరు తాగడానికి కూడా ఓ ప్రత్యేక సమయం ఉంటుందని మీకు తెలుసా?
శరీర పనితీరు సక్రమంగా జరగాలంటే నీరు ఎంతో అవసరం. అయితే, రోజంతటికి ఎంత నీరు అవసరమవుతుంది మీకు తెలుసా? శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతే అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు. ముఖం కూడా నిర్జీవంగా మారుతుంది. దీంతో చర్మ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.
మనం ఉదయం నిద్రలేవగానే పళ్లు తోముకున్న తర్వాత మొదటగా గ్లాసు నీరు తాగుతాం. దీంతో మన శరీరంలో నుంచి విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఉదయం ఘన పదార్థాలతో కాకుడా ఇలా ద్రవపదార్థంతో మన రోజును మొదలెట్టాలి. నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. కొందరు పనిలో పడి నీరు తాగడం కూడా మర్చిపోతారు. ఇలాంటి వారి కోసమే కొన్ని గాడ్జెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో సమయానికి మనం నీరు తాగాలని గుర్తు చేస్తుంది.
ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు ముందుగానే నీరు తీసుకోవాలి. కొన్ని గంటలపాటు వ్యాయామం చేస్తే శరీరంలో నీటి శాతం బయటకు వెళ్లిపోతుంది. అందుకే వ్యాయామం చేసిన తర్వాత కూడా సరిపడా నీరు తాగాలి. ఇది కాకుండా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కూడా తీసుకోవాలి. దీంతో శరీరంలో నీటి శాతం సరైన స్థాయిలో ఉండి జీర్ణ ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది.
సాధారణంగా నీరు తాగడానికి సమయం ఉంటుందని అనుకున్నాం కదా.. మనం భోజనం తినే ముందు సరిపడా నీరు తాగాలి. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటాం. తిన్న ఆహారం కూడా పోషకాలను గ్రహిస్తుంది. తినేటప్పుడు మాత్రమే కాదు మధ్యమధ్యలో కూడా నీరు తాగుతుండాలి. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )