Car Accidents Prevention: ఈ వస్తువులు మీ కారులో ఉంటే రోడ్డు ప్రమాదాలు అస్సలు జరగవు.. నమ్మశక్యంగా లేదు కదా?


Vastu Tips For Car Accidents Prevention: మన పూర్వీకులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో బలంగా నమ్మేవారు. నిత్యజీవితంలో ఏ వస్తువులను ఎక్కడ ఉంచుకోవడం శుభప్రదమో.. ఇలా ఇంటికి, మొక్కలకు, ఇతర విషయాలకు సంబంధించిన అన్నింటినీ వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే ఇందులో కారు ప్రమాదాలకు సంబంధించిన అంశాల గురించి కూడా తెలిపారని కొంతమంది వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కారులో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల ప్రమాదాలు జరగవట. అయితే కారులో ఏయే వస్తువులను ఉంచుకోవడం శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

1 /5

వాస్తు శాస్త్రం ప్రకారం డ్రైవర్ సీట్‌కి ముందు తప్పకుండా వినాయకుడి విగ్రహంతో పాటు ఇతర దేవతల విగ్రహాన్ని ఉంచుకోవడం ఎంతో శుభప్రదమట. ఈ విగ్రహాలను పెట్టడం వల్ల కారులో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందట. దీని కారణంగా ప్రమాదాలు కూడా సంభవించమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.  

2 /5

అలాగే వాస్తు శాస్త్రంలో నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రయాణాలు చేసే క్రమంలో కారులో వాటర్ బాటిల్ ఉండడం కూడా చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కారులో వాటిని బాటిల్ ఉండడం వల్ల మనసు బలంగా ఉంటుందట. దీని కారణంగా ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయట.  

3 /5

డ్రైవింగ్ చేసే క్రమంలో కారు సీటు కింద రాక్ సాల్ట్ ను ఉంచడం కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచిదని తెలుస్తోంది. రాక్ సాల్ట్ లేకపోతే దానికి బదులుగా బేకింగ్ సోడా కూడా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చట.   

4 /5

ప్రయాణాలకు ముందు కారులో నల్ల తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ తాబేలు విగ్రహం కారులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ని పూర్తిగా తొలగించి, పాజిటివ్ ఎనర్జీ ని పెంచుతుంది.  

5 /5

కారులో సహజంగా బయట లభించే రాళ్లను కూడా పెట్టుకోవడం ఎంతో మంచిదని వాస్తు శాస్త్రంలో తెలిపారు. ఈ రాళ్లు కూడా కారులోని లోపాలను సరిచేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రయాణాలు చేసేవారు తప్పకుండా కారులో సహజంగా లభించే రాళ్లను పెట్టుకోవడం చాలా శుభ్రం.