Maha Shivratri 2024: 850 ఏళ్ల చరిత్ర కలిగిన రంగులు మారే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

Maha Shivratri Special Story 2024: కొన్ని పురాతన ఆలయాల్లో నిత్యం ఎన్నో రకాల వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. అందులో చాలా వరకు భక్తులను ఆలోచనలో పడేసేవే ఉంటున్నాయి. అలాంటిదే ఓ ప్రత్యేక క్షేత్రంలోని శివలింగం ఇప్పుడు అందరి ఆలోచనల్లోని కొలువుదీరింది. ఆగ్రాలోని రాజ్ చుంగి సమీపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి 850 ఏళ్ల చరిత్ర ఉంది. 

1 /7

అయితే ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివలింగాన్ని నిత్యం వేలాదిమంది దర్శించుకుంటారు. అంతేకాకుండా ఈ శివలింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే ఈ లింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో, భక్తుల ఆలోచనల్లోకి ఈ లింగం రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 /7

ఆగ్రా నగరానికి సమీపంలో ఉన్న రాజ్ చుంగి లో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. అంతేకాకుండా దీనిని అక్కడి భక్తులు ఆగ్రాలోని చార్ ధామ్ గా కూడా పిలుస్తారు. ఈ ఆలయం అన్ని శివాలయాల కంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.  

3 /7

ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడు తాజనగరిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ దేవుడిని నాలుగు దిక్కుల రక్షిస్తాడని అక్కడి భక్తులను నమ్ముతారు. ఈ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం.

4 /7

అంతేకాకుండా ఈ ఆలయంలో ఉండే శివలింగానికి కూడా ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది చాలామంది భక్తులు ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తారు.. ఈ శివలింగం ప్రతిరోజు మూడు రంగులు మారుతుందట.

5 /7

ప్రపంచంలో రంగులు మారే శివలింగం ఉన్న ఆలయాలలో ఆగ్రాలో ఉన్న ఈ ఆలయమే ఎంతో ప్రత్యేకమైనది.. ఈ ఆలయంలో రాజేశ్వర మహాదేవ అనే శివలింగం రోజుకు మూడు రంగులు మారుతుంది. ఈ లింగాన్ని దర్శించుకుని కోరుకున్న కోరికలు మనసులో అనుకుంటే కచ్చితంగా నెరవేరుతాయట.

6 /7

ఈ శివలింగం ఉదయం పూట తెల్ల రంగులో ఉంటే.. మధ్యాహ్నం పూట మాత్రం లేత నీలం రంగులోకి మారుతుంది.. ఇక రాత్రిపూటన అయితే గులాబీ రంగులో దర్శనమిస్తుందని దేవాలయంలో ఉండే అర్చకులు తెలిపారు. ఇలాంటి రంగు మారే శివలింగం ఉన్న ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి.

7 /7

 ప్రతి మహాశివరాత్రి రోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ లింగాన్ని దర్శించుకుంటారు. అలాగే ప్రతి ఏడాది శివరాత్రి సమయంలోనే స్వామివారికి ఘనంగా ఉత్సవాలు కూడా జరుపుతారు. అయితే ప్రస్తుతం ఈ రంగులు మారే శివలింగానికి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.