Dream Astrology: కలలో ఈ ఐదు కన్పిస్తే..దానర్ధం త్వరలో కోటీశ్వరులౌతారనేనా

స్వప్నశాస్త్రంలో చాలా రకాల కలల గురించి వివరణ, అర్ధముంది. కొన్ని కలలు శుభసూచకం. చాలామంది నిద్రలో చూసే కలలతో భయపడిపోతుంటారు. కానీ వాస్తవానికి కలలనేవి ఆ మనిషి ధనవంతుడౌతాయనే సంకేతాలిస్తుంటాయి. సాధారణంగా చెడు కలకు శుభ సంకేతాలు. ఏదైనా గుడ్ న్యూస్ వినడం, పెండింగులో పనులు పూర్తవడం వంటి మంచి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

Dream Astrology: స్వప్నశాస్త్రంలో చాలా రకాల కలల గురించి వివరణ, అర్ధముంది. కొన్ని కలలు శుభసూచకం. చాలామంది నిద్రలో చూసే కలలతో భయపడిపోతుంటారు. కానీ వాస్తవానికి కలలనేవి ఆ మనిషి ధనవంతుడౌతాయనే సంకేతాలిస్తుంటాయి. సాధారణంగా చెడు కలకు శుభ సంకేతాలు. ఏదైనా గుడ్ న్యూస్ వినడం, పెండింగులో పనులు పూర్తవడం వంటి మంచి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

1 /5

కలలో పాముని చూడటం జ్యోతిష్యం ప్రకారం కలలో ఒకవేళ పాము కన్పిస్తే..అది కూడా శుభసూచకం. దీనర్ధం జీవితంలో ఏదైనా కొత్త పని ప్రారంభిస్తారని అర్ధం. ప్రత్యేకించి పాము మీకు చేరువలో కన్పిస్తే శుభం జరుగుతుందని అర్ధం.

2 /5

కలలో పూజించడం కన్పిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు అర్ధం పరమార్ధం ఉంటాయి. శుభ, అశుభ పరిణామాలుంటాయి. కొన్ని కలలు వ్యక్తి జీవితం మారుతుందనేందుకు సంకేతాలు. ఎవరైనా కలలో ఒక వ్యక్తి పూజలు చేస్తుండటాన్ని చూస్తే..శుభసూచకం. ఆ వ్యక్తి త్వరలో ధనవంతుడౌతాడని అర్ధం.

3 /5

కలలో సింహం కన్పించడం స్వప్నశాస్త్రం ప్రకారం కలలో సింహం చూడటం శుభసూచకంగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా కలలో సింహాన్ని చూస్తే దీనర్ధం త్వరలోనే అతడి ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అర్ధం. కోర్టు వివాదాలుంటే పరిష్కారమౌతాయి. త్వరలోనే విజయం లభిస్తుంది. 

4 /5

కలలో దేవుడిని చూడటం జ్యోతిష్యం ప్రకారం కలలో దేవుడిని చూడటం కూడా శుభసూచకమే. దీనివల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధి లభిస్తాయి. సాక్షాత్తూ దేవుడి దర్శనం అయిందంటే..చాలా రకాల కష్టాల్నించి ఉపశమనం లభిస్తుందని అర్ధం.

5 /5

కలలో మృతదేహాలు కన్పించడం చాలామంది కలలో మరణాలు చూస్తుంటారు. ఇవి చూసి భయపడిపోతుంటారు. కలలో కన్పించింది నిజమౌతుందేమోనని. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం కలలో మృత్యువు చూడటం శుభసూచకం. ఈ కలకు అర్ధం త్వరలోనే మీ కోర్కెలు పూర్తవుతాయని అర్ధం. జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయని అర్ధం.