Health Tips: ఉదయం బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే చాలు..మందులతో పనే ఉండదు..!!

Healthy Fruits: ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ ఉదయం బ్రేక్ ఫాస్టులో పండ్లు తీసుకుంటే బోలేడు లాభాలు ఉన్నాయి. బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే మందులతో పనే ఉండదంటున్నారు నిపుణులు. ఆ పండ్లు ఏవో చూద్దామా? 

1 /9

Empty Stomach: ఉదయం మనం తీసుకునే ఆహారంపైనే రోజంతా ఆధారపడి ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోజంతా హుషారుగా ఉంటాం. నిజానికి మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ మన ఆహారంలో పండ్లను చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్న మాట. 

2 /9

పండ్లు తినడానికి సమయం అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైనా తినవచ్చు. కానీ ఉదయం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్, హై బ్లడ్ ప్రెషర్, ఊబకాయం వంటి వ్యాధులతో బాధపడే వారు ఆహారం పండ్లను చేర్చుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. మీరు ఖాళీ కడుపుతో, ఉదయం బ్రేక్ ఫాస్టులో పండ్లు తింటే శరీరం పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తుంది. పండ్లలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరం అందులో ఉన్న పోషకాలన్నింటినీ గ్రహించేస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్టులో తినాల్సిన  పండ్లు ఏవో చూద్దాం. 

3 /9

అరటిపండ్లు: అరటి పండ్లు  తేలికగా జీర్ణమవుతాయి. వాటిలో ఉండే  సహజ చక్కెరల కారణంగా త్వరగా  శక్తిని అందిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.   

4 /9

పుచ్చకాయ:  పుచ్చకాయలో  వాటర్ కంటెంట్ పుష్కలంగా  ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాదు పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి పుచ్చకాయ తింటే బరువు తగ్గుతారు.   

5 /9

బొప్పాయి: బొప్పాయిలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకంతో బాధపడుతున్నవారికి ఎంతో మేలు చేస్తుంది.    

6 /9

నారింజ: ఆరేంజ్ లో  విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  మీ జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.   

7 /9

యాపిల్స్: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో అవసరం ఉండదు అనేది తరచుగా వింటూనే ఉంటాం. యాపిల్స్ లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు జీర్ణక్రియలో సహాయపడతాయి.  

8 /9

పైనాపిల్: పైనాపిల్లో  బ్రోమెలైన్, జీర్ణక్రియకు సహాయపడే, వాపును తగ్గించే ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని పడగడుపున తింటే ఆరోగ్యానికి మంచిది.   

9 /9

మామిడిపండ్లు: మామిడిలో విటమిన్లు, ఫైబర్‌ అధిక మోతాదులో ఉంటాయి. మామిడి పండ్లను అల్ఫాహరంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.