Korean Skincare: కొరియన్ గ్లో అంటే ఏమిటి? ఎలా సహాయపడుతుంది..


Korean Skincare Routine: కొరియన్ బ్యూటీ రూటీన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వారి మెరిసే చర్మం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ గ్లో అంతా ఒక్క రోజులో వచ్చేది కాదు. దీని వెనుక ఒక నిర్దిష్టమైన, శ్రద్ధగా చేసే చర్మ సంరక్షణ విధానం ఉంటుంది.
 


Korean Skincare Routine: కొరియన్ గ్లో అంటే ఆరోగ్యంగా, తేమతో నిండి, మృదువుగా ఉండే చర్మం. ఇది ఒక రకమైన ప్రకాశాన్ని ఇస్తుంది. అది చర్మాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ గ్లో సాధించడానికి కొరియన్లు తమ చర్మాన్ని బాగా అర్థం చేసుకోవడం దానికి అనుగుణంగా ఉండే ఉత్పత్తులను, విధానాలను ఉపయోగించడం చేస్తారు.

1 /7

కొరియన్ గ్లో కోసం మీరు ఏం చేయాలి?

2 /7

డబుల్ క్లెన్సింగ్: మొదట ఆయిల్-బేస్డ్ క్లెన్సర్‌తో మేకప్ ఇతర నూనె ఆధారిత మలినాలను తొలగించండి. ఆ తర్వాత ఫోమ్ లేదా జెల్ క్లెన్సర్‌తో చర్మాన్ని శుభ్రం చేయండి.

3 /7

ఎక్స్‌ఫోలియేషన్: వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం చర్మాన్ని మృదువుగా చేసి, మృతకణాలను తొలగించడానికి సహాయపడుతుంది.

4 /7

టోనర్: చర్మాన్ని తేమగా ఉంచి, pH స్థాయిని సమతుల్యం చేయడానికి టోనర్ ఉపయోగించండి.

5 /7

ఎసెన్స్: ఎసెన్స్ చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. చర్మం  బారియర్ ఫంక్షన్‌ను బలోపేతం చేస్తుంది.

6 /7

సీరం: చర్మం అవసరాలను తీర్చడానికి ఒక సీరం ఎంచుకోండి. ఉదాహరణకు, ముడతలు తగ్గించడానికి, లేదా మచ్చలను తొలగించడానికి.

7 /7

అయిజ్ క్రీమ్: కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన చర్మానికి అయిజ్ క్రీమ్ ఉపయోగించండి.