IPO: నేటి నుంచి Ecos India Mobility IPO ప్రారంభం.. ఇందులో డబ్బులు పెట్టాలా వద్దా..? మార్కెట్ గురు అనిల్ సింఘ్వీ ఏం చెప్పారంటే..?

Ecos India Mobility: ఈ మధ్యకాలంలో వరుసగా ఐపీవోలు స్టాక్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ రోజు లిస్ట్ అయినా ఓరియంట్ టెక్నాలజీస్ 40% ప్రీమియం ఇవ్వగా 26వ తేదీన లిస్ట్ అయిన ఇంటర్ ఆర్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఐపిఓ 43% రిటర్న్స్ అందించాయి ఆగస్టు 13వ తేదీన లిస్ట్ అయిన యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ సంస్థ ఏకంగా 113% రిటర్న్ అందించింది ఈ నేపథ్యంలో మంచి ఐపిఓల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లిస్టింగ్ వేళ పెద్ద ఎత్తున లాభాలు పొందవచ్చని ఇటీవల జరిగిన కొన్ని ఐపీఓల లిస్టింగ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. 

1 /5

Ecos India Mobility IPO: ECOS (ఇండియా) మొబిలిటీ & హాస్పిటాలిటీ లిమిటెడ్  రవాణా సేవలను అందించే సంస్థ. IPO బుధవారం, ఆగస్టు 28 ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు IPO 0.89 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. కంపెనీ  ఈ OFS, ఆఫర్ ఫర్ సేల్ కింద IPO ఆగస్టు 28 నుండి తెరుచుకుంది. ఈ ఐపీవోలో ఆగస్టు 30వ తేదీ వరకూ బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. ఒక్కో షేరు ధరను కనిష్టంగా రూ.318- గరిష్టంగా రూ. 334గా కంపెనీ నిర్ణయించింది.

2 /5

ప్రముఖ ఎనిలిస్ట్ అనిల్ సింఘ్వీ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ IPOలో కేవలం లిస్టింగ్ లాభం కోసమే డబ్బును పెట్టుబడి పెట్టవచ్చని చెబుతున్నారు. మీరు ఈ కంపెనీలో షేర్లను ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం కంపెనీ పెర్ఫార్మన్స్ మెరుగుపడితే అది సాధ్యం అవుతుందని చెబుతున్నారు.   

3 /5

ECOS (ఇండియా) మొబిలిటీ & హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీ ప్రమోటర్లు అనుభవజ్ఞులు. గత ఏడాది ఈ కంపెనీకి ఆర్థికంగా బలంగా ఉంది. క్యాష్ ఫ్లో కూడా సానుకూలంగా ఉంది.   

4 /5

నెగిటివ్ అంశాలు ఏమిటి? కంపెనీ నెగిటివ్  విషయాలు ఏమిటంటే మొత్తం IPOను OFS ప్రాతిపదికన ప్రారంభించారు. అయితే మార్కెట్లో అనార్గనైజ్డ్ కంపెనీల నుంచి  వీరికి పెద్ద పోటీ ఉంటుంది.  IPOకి ముందు గత సంవత్సరంలోనే కంపెనీ బలమైన ఆర్థిక వృద్ధిని కనబరిచింది.  ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో పోలిస్తే, కంపెనీ వేల్యూయేషన్స్  ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి.   

5 /5

కంపెనీ IPO పూర్తిగా రూ.601 కోట్ల విలువైన 1.8 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయానికి సంబంధించిన ఆఫర్. ఇది OFS అయినందున, ఢిల్లీకి చెందిన కంపెనీ IPO నుండి ఎలాంటి ఆదాయాన్ని పొందదు  ఆ డబ్బు షేర్లను విక్రయించే ప్రమోటర్లకు వెళ్తుంది. ఇష్యూ పరిమాణంలో సగం అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారులకు, 35 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు  మిగిలిన 15 శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఈ ఐపీవో బిడ్డింగ్ కోసం కనీసం 44 షేర్లను కొనుగోలు చేయాలి. ఇందు కోసం 14,696 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.