Foods to Avoid: మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..అయితే మీ రెగ్యులర్ డైట్ సరిగ్గా ఉండేట్టు చూసుకోండి. లేకపోతే వ్యాధి ముదిరిపోతుంది. హార్ట్ సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. దేశంలో అత్యధిక శాతం ప్రజలు బీపీ బారిన పడుతున్నారనేది నివేదికలు చెబుతున్నాయి. బీపీను నియంత్రించలేకపోతే..హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తలెత్తుతాయి. బీపీ సమస్య ఉన్నవాళ్లు 5 రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం.
కేవలం ఉప్పు మాత్రమే కాదు పంచదార అంటే షుగర్ కూడా మీ రక్తపోటుకు కారణమౌతుంటుంది. స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లావు అవుతామని అందరికీ తెలుసు. అధిక బరువు అనేది రక్తపోటుకు ప్రధాన కారణం. మహిళలు రోజుకు 25 గ్రాములు, పురుషులైతే 36 గ్రాములకు మించి తీపి తీసుకోకూడదు.
అధిక రక్తపోటును పెంచడం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పుకు కారణం సోడియం. ఎందుకంటే రక్తంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌పై ఇది ప్రభావం చూపిస్తుంది. తెల్ల ఉప్పు పూర్తిగా మానేయాలి. ఇందులో 40 శాతం సోడియం ఉంటుంది. ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే..చిప్స్, పిజ్జా, శాండ్విచ్, రోల్స్, కైండ్ సూప్, ఫ్రోజెన్ ఫుడ్స్ వంటివి దూరం చేయాలి.
ఎక్కువ కాలం నిల్వ ఉంచే ఆహారపదార్ధమేదైనా సరే అందులో ఉప్పు ఎక్కువగానే ఉంటుంది. పికిల్స్లో కారం, ఉప్పు, మసాలా ఎక్కువగా ఉంటాయి ఇవి అధిక రక్తప్రసరణకు కారణమౌతాయి.
అతిగా మద్యం తీసుకునేవారిలో కూడా రక్తపోటు అధికంగా ఉంటుంది. ముందు నుంచే బీపీ వ్యాధి ఉంటే వైద్యుడి సలహా లేకుండా మద్యం సేవించకూడదు. బీపీ లేనివారు పరిమితంగా మద్యం తీసుఏ సమస్యా తలెత్తదు. బీపీ రోగులు మద్యం తీసుకోవడం వల్ల బీపీ మాత్రల ప్రభావం కూడా ఉండదు.
Cheese అనేది పాలకు సంబంధించిన ఉత్పత్తి అయినా..ఇందులో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సోడియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కేవలం రెండు స్లైస్ ఛీజ్‌లో 512 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఇందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్ కూడా అధికం. అందుకే ఛీజ్ తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.