Ramadan 2024 Diet: రేపటి నుంచి రంజాన్ పవిత్రమాసం.. ఈ డ్రైఫ్రూట్స్ తింటే అస్సలు ఆకలేయ్యదు.. డబుల్ ఎనర్జీ..

Ramadan 2024: సౌదీ అరేబియాలో నెలవంక కన్పించింది. ఈ క్రమంలో భారత్, బంగ్లాదేశ్, పాక్ లలో మార్చి 12 నుంచి రంజాన్ ను జరుపుకుంటారు. రంజాన్ నెల రోజుల పాటు ముస్లిం సోదరులు కఠినంగా ఉపవాసం ఉంటారు. కనీసం ఉమ్మును కూడా మింగకుండా ఫాస్టింగ్ ఉంటారు. ఉపవాసంను సహారీ, ఇఫ్తార్ లు పాటిస్తారు.
 

1 /6

రంజాన్ నెల రోజుల పాటు తెల్లవారు జామున 3 నుంచి 4 గంటలకు ముందు భోజనం చేస్తారు. ఆ తర్వాత మజ్జీత్ నుంచి ప్రత్యేకంగా సైరన్ ను మోగిస్తారు అప్పుడు.. ఉపవాసం ప్రారంభిస్తారు. సాయంత్రం తిరిగి మజ్జీత్ నుంచి సైరన్ మోగగానే ఉపవాసం ను ముగిస్తారు. ఈ సమయంలో మంచి నీళ్లు కూడా అస్సలు ముట్టుకోరు.  

2 /6

నెల రోజుల పాటు అల్లా గురించే నమాజ్ చేస్తుంటారు. తమ సంపాదనలో కొంత భాగంను పేదలకు దానంగా ఇస్తారు. ముఖ్యంగా రంజాన్ పవిత్రమాసంలో ఏదానం చేసిన, ఎన్నిసార్లు నమాజ్ లు చేసిన , ఖురాన్ లు పఠించిన కూడా మాములు సమయంలో చేసిన దాని కన్న రెట్టింపు మంచి ఫలితం ఉంటుందని భావిస్తారు.  

3 /6

30 రోజులపాటు కఠినంగా ఉపవాసం ఉంటారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. రోజుకు ఐదు మార్లు నమాజ్ చేస్తారు. ఈ సమయంలో చాలా మంది మంచి హెల్తీ డ్రైఫ్రూట్స్, ఖర్జూరం లను తింటారు. బాదంలు, కాజులు, వాల్ నట్స్ లు, పండ్లను ఎక్కువగా తింటారు. ఇవి తింటే ఫుల్ ఎనర్జీటిక్ గా ఉంటుందంట..  

4 /6

కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇక రంజాన్ మాసం కూడా ప్రారంభమైంది. దీంతో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ లను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. బాదంలను రాత్రిపూట నీళ్లలో నాన బెట్టుకుని ఉదయాన్నే తింటే శరీరానికి చాలా పోషకాలు అందుతాయి.  

5 /6

చిన్న పిల్లలు, పెద్దవయసు గల వారు కొంత జాగ్రత్తగా ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా డయాబెటిక్ పెషెంట్లు, బీపీ సమస్యలు ఉన్న వారు రంజాన్ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాటర్ మిలన్, యాపిల్, అంగుర్ వంటి పండ్లను ఎక్కువగా తినాలి.  

6 /6

సహారీ కి ముందు ఇఫ్తార్ తర్వాత సరైన మంచి పోషకాలతో ఉన్న ఆహారంను తీసుకొవాలి. ఫ్రూట్ జ్యూస్ లు తాగటానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. ఉపవాసం కాలంలో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే పనులకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటూ అల్లాను తలుచుకుంటూ ఫాస్టింగ్ ఉండాలి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)