Friday Lakshmi Mantra: శుక్రవారం ఈ మంత్రాలను పఠిస్తే... జీవితాంతం లక్ష్మీ దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది..

లక్ష్మీ దేవీ అంటే సకల సంపదలకు, అష్ట ఐశ్వర్యాలకు అనుగ్రహం ఇచ్చే దేవత. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. శుక్రవారం భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని ఆరాధించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు ఆయా రాశుల వారు కొన్ని మంత్రాలను విధింగా పఠించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 
  • May 13, 2022, 12:40 PM IST

Friday Lakshmi Puja: లక్ష్మీ దేవీ అంటే సకల సంపదలకు, అష్ట ఐశ్వర్యాలకు అనుగ్రహం ఇచ్చే దేవత. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. శుక్రవారం భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని ఆరాధించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు ఆయా రాశుల వారు కొన్ని మంత్రాలను విధింగా పఠించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

1 /5

తులారాశి- తులారాశి వారు మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే "ఓం హ్రీం క్లీం శ్రీం" అనే మంత్రాన్ని పఠిస్తే ఎంతో ఫలితం ఉంటుంది. వృశ్చికరాశి- ఈ రాశి వారు "ఓం ఐం క్లీం సౌం:" అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మకరం- మకరరాశి వారికి మహా లక్ష్మి అనుగ్రహం పొందడానికి, "ఓం ఐం క్లీం హ్రీం శ్రీ సౌన్:" అనే మంత్రాన్ని జపించాలి.

2 /5

కుంభం- ఈ రాశి వారు "ఓం హ్రీం ఐం క్లీం శ్రీం" అనే మంత్రాన్ని జపించాలి. మీన రాశి - మీరు లక్ష్మి మాత అనుగ్రహం పొందాలంటే, "ఓం హ్రీం క్లీం సౌం:" అనే మంత్రాన్ని జపించాలి. కర్కాటకం- మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి ఈ రాశి వారు "ఓం ఐం క్లీం శ్రీ" అనే మంత్రాన్ని పఠించాలి.

3 /5

సింహ రాశి - లక్ష్మి మాత అనుగ్రహం కోసం సింహ రాశి వారు "ఓం హ్రీం శ్రీ సౌం:" అనే మంత్రాన్ని జపించాలి. కన్య రాశి- ఈ రాశి వారికి లక్ష్మీ మాత మంత్రాన్ని "ఓం శ్రీ ఐం సౌం:" పఠించడం విశేష ఫలాన్నిస్తుంది. మేష రాశి వారు - లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి "ఓం ఐం క్లీం సౌం:" అనే మంత్రాన్ని జపించండి.

4 /5

వృషభ రాశి వారు- ఈ రాశి వారు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి "ఓం ఐం క్లీం శ్రీం" అనే మంత్రాన్ని కనీసం ఒక్కసారైన జపించాలి. మిథున రాశి వారు - మిథున రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి "ఓం క్లీన్ ఐన్ సౌన్:" అనే మంత్రాన్ని పఠించడం చాలా శుభప్రదం.  

5 /5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రాన్ని అనుసరించి ఆయా మంత్రాలతో లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా ఆ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. జీవితాంతం లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.