2025 Most Awaited Telugu Movies: 2024 గిర్రున తిరిగిపోయింది. అపుడే 2025 అడుగుపెట్టాం. ఈ నేపథ్యంలో కొత్త యేడాదిలో పలు చిత్రాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పాటు బాలయ్య.. ‘డాకూ మహారాజ్’ .. వెంకటేష్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. మరోవైపు కొన్ని చిత్రాలు తన సినిమాల రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
గేమ్ ఛేంజర్.. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో ముందుగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
డాకూ మహారాజ్ (Daaku Maharaaj).. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకూ మహారాజ్’. ఈ మూవీ జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా బాలయ్యకు సంక్రాంతి హీరోగా ఈ సీజన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే కదా.
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతికే ఈ మూవీని సంక్రాంతి బరిలో జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
హరి హర వీరమల్లు.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈయన హీరోగా విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే. ఈ సినిమాను ఈ యేడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
ది రాజా సాబ్.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
విశ్వంభర.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నచిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం అందరిక కంటే ముందు జవనరి 10న సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ వంటివి ఉన్నాయి. మరోవైపు కుమారుడు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ డేట్ లో విడుదల కోసం ఈ సినిమాను మే 9కు పోస్ట్ పోన్ చేశారు.ఆ డేట్ కు ఈ సినిమా విడుదల కావడం డౌటే అని చెబుతున్నారు.
వార్ 2.. ‘దేవర పార్ట్ -1’ తర్వాత ఎన్టీఆర్ డైరెక్ట్ గా హిందీలో యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘వార్ 2’. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. తెలుగు, హిందీ బిగ్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీని ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.