Gajakesari Yogam: జ్యోతిష్య గ్రహ మండంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి పరిభ్రమిస్తుంటాయి. ఇక చంద్రుడు, బృహస్పతి కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది. మరో రెండు ఈ యోగం వల్ల ఈ రాశుల వారి జీవితం జెడ్ స్పీడ్ లో దూసుకుపోవడం ఖాయం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతంది. కెరీర్ పరంగా దూసుకుపోతారు. ఆకస్మిక ధనలాభం చేకూరనుంది.
ధనుస్సు రాశి.. జనవరి 9 గజకేసరి రాజయెగం వలన ఈ రాశి వారి కెరీర్‌లో అనుకోని లాభాలను అందుకుంటారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ఇదే అనువైన సమయం. పూర్వీకుల ఆస్తిని పొందవచ్చు. మీ దృష్టి మీ కెరీర్‌పైనే పెట్టాలి.
సింహ రాశి.. సింహ రాశి వారికీ గజకేసరి యోగం వల్ల ఆర్ధికంగా పుంజుకుంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు ఎంతో చాలెంజింగ్ గా స్వీకరిస్తారు. వ్యాపారంలో వీళ్లకు ఎదురుండదు.
కన్య రాశి.. గురువు, చంద్రుడి కలయిక వల్ల కన్య రాశి వారిలో కొత్తగా పెళ్లైన వారికి ఈ యేడాది పిల్లలు పుట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకోని లాభాలను ఆర్జిస్తారు. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు వివాహా యోగం ఉంటుంది. ఆర్థికంగ నిలదొక్కుకుంటారు.
వృషభ రాశి.. వృషభ రాశి వారికి లగ్నంలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. దీని వల్ల ఈ రాశి వారు అన్ని రంగాలలో వీరికి ఎదురుండదు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే క్యాండిడేట్స్ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల కుట్రకు ఛేదిస్తారు. సీనియర్ అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
కుంభ రాశి.. కుంభ రాశి వారికి గజకేసరి యోగం వలన కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు పటాపంచలు అవుతాయి. కెరీర్ లో ముందడుగు వేస్తారు. వాహన యోగం ఉంది. ఆర్ధికంగా వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇదే అనువైన సమయం.
గమనిక: ఈ కథనం మతపరమైన ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.