Bad Habits: గరుడ పురాణం ప్రకారం ఈ చెడు లక్షణాలు ఉంటే లక్ష్మీ దేవి దూరం.. జీవితంలో అనేక కష్టాలు

Garuda Puranam Saying These Bad Habits: హిందూ గ్రంథాల్లో గరుడ పురాణం చాలా ముఖ్యమైంది. ఈ గ్రంథం జీవితానికి సంబంధించిన కొన్ని సూచనలు, హెచ్చరికలు చేస్తోంది. కొన్ని చెడు అలవాట్లు అస్సలు ఉండవద్దని సూచిస్తోంది. ఈ లక్షణాలు ఉంటే జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు.

1 /7

కష్టాలు: గరుడ పురాణం జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెబుతోంది. కొన్ని లక్షణాలు ఉంటే చాలా కష్టాలు పడతారని గరుడ పురాణం పేర్కొంటోంది.

2 /7

అవలక్షణాలు: మానవుడు కొన్ని అవలక్షణాలు ఉండవద్దని చెబుతోంది. కొన్ని లక్షణాలు ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తోంది.

3 /7

అపరిశుభ్రత: గరుడ పురాణం ప్రకారం.. అపరిశుభ్రంగా జీవించడం చాలా తప్పు. ఉదయాన్నే స్నానం చేయకపోవడం.. శుభ్రమైన దుస్తులు ధరించకపోవడం పేదరికానికి దారి తీస్తుందని గరుడ పురాణం చెబుతోంది.

4 /7

చెడు బుద్ధి: ఎవరికైనా చెడు చేయాలని చూస్తే మీకే చెడు జరుగుతుంది. అలా చేయాలనుకుంటే వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోనాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తులు జీవితం మొత్తం బాధతో ఉంటారు.

5 /7

దురాశ: అత్యాశ, దురాశ అనేది ఉండకూడదు. మనసులో అత్యాశ ఉన్నవాడు ఎప్పుడూ ఓడిపోతాడని గరుడ పురాణం చెబుతోంది.

6 /7

వంటగది: గరుడ పురాణం వంట గది విషయమై కూడా చెప్పింది. అన్నపూర్ణ దేవి వంటగదిలో ఉంటుంది. అందుకే స్నానం చేసిన మాత్రమే వంట గదిలోకి వెళ్లాలి. రాత్రి వంట గదిని శుభ్రం చేశాకే నిద్రపోవాలి. వంట గది మురికిగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసించదు.

7 /7

నిద్ర ఆలస్యం: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోడం.. ఆలస్యంగా నిద్ర లేవడంతో బద్ధకం ఏర్పడుతుంది. బద్ధకం ఉన్నవారు విజయం సాధించలేరు. సూర్యోదయం తర్వాత నిద్రించడం అశుభ సంకేతం. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే బద్దకం ఎదగాలి.