Glenn maxwell and vini raman నిశ్చితార్ధానికి ఏడాది..వైరల్ అవుతున్న నిశ్చితార్ధం ఫోటోలు

ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పుడు తన నిశ్చితార్ధపు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిశ్చితార్దానికి ఏడాది పూర్తయిన సందర్బంగా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ చేశారు. ఇంతకీ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు కాబోయే శ్రీమతి ఎవరో తెలుసా..ఇండియన్ గర్ల్ వివి రమన్.

Glenn maxwell and vini raman: ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పుడు తన నిశ్చితార్ధపు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిశ్చితార్దానికి ఏడాది పూర్తయిన సందర్బంగా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ చేశారు. ఇంతకీ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు కాబోయే శ్రీమతి ఎవరో తెలుసా..ఇండియన్ గర్ల్ వివి రమన్.

1 /7

గ్లెన్ మ్యాక్స్‌వెల్ అక్టోబర్ 2019లో శ్రీలంకకు వ్యతిరేకంగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన తరువాత అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియన్ క్రికెట్ నుంచి దూరమయ్యారు.

2 /7

మ్యాక్స్‌వెల్ మానసికంగా శారీరకంగా అలసిపోయున్నాడు. అదుకే 2019 అక్టోబర్ లో మానసిక ఆరోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోకతప్పలేదు. 

3 /7

మ్యాక్స్‌వెల్ మానసికంగా బాగాలేనందున క్రికెట్ నుంచి దూరంగా ఉన్నాడు. అతడి మానసిక ఆరోగ్య సమస్యల్ని గుర్తించింది వివి రమన్ అని మ్యాక్స్‌వెల్ వెల్లడించాడు.

4 /7

వివి రమన్‌ను వివాహం చేసుకున్న తరువాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియాకు వచ్చిన మూడవ అల్లుడు కానున్నాడు. గతంలో షాన్ టైంట్ , వివియన్ రిచర్డ్స్‌లు ఇండియన్ గర్ల్‌ను వివాహమాడి భారతదేశానికి అల్లుళ్లుగా వచ్చారు.

5 /7

గ్లెన్ మ్యాక్స్‌వెల్..వివి రమన్‌తో నిశ్చితార్ధం జరిగిన నెల రోజుల తరువాత మరోసారి ఇండియన్ స్టైల్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. 

6 /7

గత యేడాది ఫిబ్రవరిలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో వివి రమన్‌తో నిశ్చితార్ధమైందని..త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని స్పష్టం చేశాడు.

7 /7

విదేశీ క్రికెటర్లు ఇండియన్ గర్ల్స్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకోవడం  ఇది తొలిసారి కాదు. గతంలో వెస్ట్ ఇండీస్ టాప్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్..ఇండియన్ గర్ల్ నీనా గుప్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. లవ్ యూ వివి రమన్..ఇక నేను నీ ప్రేమలో ముసలివాడినై నీరసపోయే వరకూ నిరీక్షించలేను.