EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలా


EPFO Udpate:  మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.

1 /6

EPFO Udpate: మోదీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ప్రైవేటు ఉద్యోగులకు ఇది ఒక శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల షరతుల కింద ఉద్యోగికి రూ. 50 వేలు బోనస్ అందిస్తామని తెలిపింది.  

2 /6

భారతదేశంలోని ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే EPFO ​​ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. EPFO ​​ కొన్ని నియమాలు చాలా మంది ఉద్యోగులకు తెలియదు. ఈ నియమాలలో ఒకటి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్ ఒకటి అని చెప్పవచ్చు.  ఇందులో ఉద్యోగి నేరుగా రూ.50,000 వరకు బోనస్ లభిస్తుంది.   

3 /6

ఇందుకోసం PF ఖాతాదారులందరూ ఉద్యోగాలు మారిన తర్వాత కూడా అదే EPF ఖాతాకు కంట్రిబ్యూట్ చేయడం కొనసాగించాలని సూచిస్తున్నారు. ఇది వరుసగా 20 సంవత్సరాల పాటు ఒకే ఖాతాకు కంట్రిబ్యూట్ చేసిన తర్వాత లాయల్టీ-కమ్-లైఫ్ ప్రయోజనాలను పొందేందుకు వారికి అవకాశం ఇస్తుంది.

4 /6

నిజానికి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ ద్వారా ఈ అదనపు బోనస్ మొత్తాన్ని EPFO ​​మీకు అందిస్తుంది. దీని కోసం, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొన్ని షరతులు నెరవేర్చాలి. కనీసం 20 సంవత్సరాల పాటు PF ఖాతా కలిగి ఉద్యోగులు మాత్రమే అదనపు బోనస్ ప్రయోజనాన్ని పొందగలరు. అలాగే, మీరు ఎంత బోనస్ పొందాలో నిర్ణయించడానికి మీ ప్రాథమిక జీతం ఆధారంగా తీసుకుంటారు. మీ అదనపు బోనస్ దీని ఆధారంగా లెక్కించబడుతుంది. గరిష్ట బోనస్ మొత్తం రూ. 50000 వరకు ఉండవచ్చు.   

5 /6

ప్రాథమిక జీతం రూ. 5000 ఉన్న ఉద్యోగులు సుమారు రూ. 30,000 అదనపు బోనస్‌గా పొందే అవకాశం ఉంటుంది. 10,000 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగులు ఈ మొత్తాన్ని రూ.40,000 పొందుతారు. అంతకు మించిన వేతనాలపై బోనస్ మొత్తం రూ.50 వేల వరకు ఉంటుంది. బోనస్ పొందడానికి అర్హత కనీసం 20 సంవత్సరాల సర్వీసు అని గుర్తించాలి.   

6 /6

పదవీ విరమణ తర్వాత ఈ అదనపు బోనస్ లభిస్తుంది. తద్వారా ఉద్యోగులు కొంత అదనపు డబ్బు నుండి ప్రయోజనం పొందవచ్చు. మీరు కూడా 20 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసినట్లయితే, మీ బేసిక్ జీతం ప్రకారం అదనపు బోనస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు బోనస్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కూడా మీకు అందుబాటులో ఉంటుంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x