Ancient Shipwreck Treasure: సముద్ర లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ రహస్యాలు అప్పుడప్పుడూ వివిధ పరిశోధనల్లో బయటపడుతుంటాయి. ఇటీవల గ్రీస్ పరిశోథకులు అద్భుతమైన అణ్వేషణ వెలికితీశారు. కాసోస్ ఐలాండ్ సమీపంలో 5000 ఏళ్ల నాటి ఓడ శిధిలాలు వెలికి తీశారు. పురావస్తు పరిశోధకులకు ఇదొక ఖజానా లాంటిది. సముద్రంలో లోతుల్లో 20 నుంచి 47 మీటర్ల లోతులో దాదాపు 10 ఓడలకు చెందిన శిధిలాలు కనుగొన్నారు.
Ancient Shipwreck Treasure: ఇందులో ఒక ఓడ 3000 బీసి నాటిది. క్లాసిక్ పీరియడ్ అంటే క్రీస్తుపూర్వం 460, హెలీనిస్టిక్ పీరియడ్ అంటే క్రీస్తుశకం 100, రోమన్ పీరియడ్ అంటే క్రీస్తుశకం 300-200, బీజాంటిన్ పీరియడ్ అంటే క్రీస్తు శకం 800-900 తోపాటు మిడిల్ పీరియడ్, ఓటోమన్ పీరియడ్ నాటి అవశేషాలు కూడా బయటపడ్డాయి. పరిశోధనలో 20 వేలకు పైగా ఫోటోలు తీశారు. కొంత మెటీరియల్ లభ్యమైంది. ప్రాచీనకాలం నాటి ఈ మెటిరియల్ ఆధారంగా నాటి వివరాలు మరింత విస్తృతంగా తెలుసుకునేందుకు వీలుంటుంది.
ఈ పరిశోధనలతో మధ్యధరా సముద్రం ప్రాంతంలో సాంస్కృతిక, వ్యాపార పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు వీలుంటుంది.
గ్రీకు సాంస్కృతిక శాఖ 2019లో హెలెనిక్ నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి ఈ అధ్యయనం ప్రారంభించింది. 20 వేలకు పైగా ఫోటోలు సముద్రగర్భంలో తీశారు. ఓడల శిధిలాలకు చెందిన డిజిటల్ ఇమేజెస్ సిద్ధం చేశారు.
కాసోస్ ద్వీపం సమీపంలో జరిపిన రీసెర్చ్‌లో ఆధునిక కాలం నాటి ఓడ శిధిలాలు కూడా లభ్యమయ్యాయి. ఇదొక కలపతో చేసిన ఓడ. ఇందులో ధాతువుల్ని కూడా ఉపయోగించారు. ఇది రెండవ ప్రపంచయుద్ధం నాటి ఓడ కావచ్చని అంచనా.
సముద్రంలో 20-47 మీటర్ల లోతులో ఈ శిధిలాలు లభించాయి. స్పెయిన్, ఇటలీ, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్నించి సరుకు తీసుకెళ్లే ప్రాచీన ఓడల శిధిలాలున్నాయి. అప్పటి గిన్నెలు, మట్టితో చేసిన గిన్నెలు, ప్రాచీన కాలం నాటి లంగరు లభించాయి.