Gunde Ninda Gudi Gantalu: ఈ స్టార్‌ నటి బాలు రియల్‌ లైఫ్ వైఫ్ .. 2 నెలలకే పెళ్లి పెటాకులు..!

Balu Real Life Wife Photos: గుండె నిండా గుడిగంటలు ప్రస్తుతం ఈ సీరియల్‌ మంచి టీఆర్‌పీతో దూసుకెళ్తుంది. ఈ సీరియల్‌ మొదటి ఎపిసోడ్‌ నుంచి మంచి ప్రేక్షక ఆధరణ పొందింది. ఈ సీరియల్‌ తమిళ్‌లో మంచి ఆధరణ పొందింది. అయితే, ఈ సీరియల్‌కు ప్రత్యేక ఆకర్షణ అయిన బాలు క్యారక్టర్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.
 

1 /5

గుండె నిండా గుడిగంటలు ప్రతిరోజూ మాటీవీలో టెలిక్యాస్ట్‌ అయ్యే ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర బాలు.ఈయన అసలు పేరు విష్ణుకాంత్‌. 'ముళ్లకంప' అనే పేరు కూడా సీరియల్‌ ఉంది. పూలగంప అంటూ బాలు వేసే డైలాగ్‌లకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. 

2 /5

అయితే, ఆయన తమిళనాడులో జన్మించారు. పలు సీరియళ్లలో నటించారు. కొన్నిటికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం తెలుగు సీరియల్‌ గుండె నిండా గుడిగంటల్లో నటిస్తున్నారు. మొదట్లో ఊర మాస్, రౌడీ క్యారెక్టర్‌లో చూపించారు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోతాడు.  

3 /5

విష్ణుకాంత్‌ తమిళ నటి సంయుక్తను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఓ సీరియల్‌లో నటించారు. ఆ పరిచయం కాస్త స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల రెండు నెలలకే వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.వీరి విడాకుల వ్యవహారం అప్పట్లో బాగా వైరల్‌ అయింది. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే పెళ్లి పెటాకులు అయింది.  

4 /5

ఇక మాటీవీలో టెలిక్యాస్ట్‌ అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్‌ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హిరోయిన్‌గా మీనా క్యారక్టర్ కన్నడ నటి అమూల్యా గౌడ నటించారు. తల్లి ప్రభావతి క్యారక్టర్‌లో అనిలా శ్రీకుమార్‌  తదితరులు నటించారు.  

5 /5

ఈ సీరియల్‌ తల్లిదండ్రులు ముగ్గురు కొడుకులకు సంబంధించింది. ఇందులో రెండో కొడుకుగా హీరో విష్ణుకాంత్‌ నటిస్తున్నారు. తల్లికి ఏ కోసానా ఇష్టం లేని కొడుకు క్యారక్టర్‌లో నటించారు. బాలుగా ప్రతి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x