Hajj 2024: మక్కాలో ప్రారంభమైన హజ్ యాత్ర, పోటెత్తిన లక్షలాది భక్తులు

Hajj 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పవిత్ర తీర్ధక్షేత్రమైన మక్కాలో హజ్ యాత్ర ప్రారంభమైంది. జూన్ 13నుంచి జూన్ 19 వరకూ హజ్ జరుగుతుంది. మొత్తం 40 రోజుల యాత్ర ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్నించి పెద్దఎత్తున ముస్లింలు హజ్ యాత్రకై మక్కా సందర్శిస్తుంటారు. 

ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది విది. తాహతు కలిగిన  ప్రతి ఒక్కరూ హజ్ యాత్ర చేయాల్సిందే.  సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ప్రతి యేటా జిల్ హజ్ మాసంలోని 10వ రోజున బక్రీద్ పండుగ సందర్బంగా హజ్ యాత్ర ఉంటుంది. 

1 /5

హజ్ అంటే ఏంటి హజ్ మొదటి రోజున హాజీలు కాబా సందర్శిస్తారు. ఏడుసార్లు కాబా చుట్టూ తిరుగుతారు. ఆ తరువాత సఫా, మర్వా కొండల మధ్య మార్గంలో తిరిగొస్తారు. 

2 /5

అతి పెద్ద పుణ్యక్షేత్రం ఇస్లాంలో  5-6 రోజులు జరిగే హజ్ యాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటి. ఇస్లాంలో ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా స్థోమత ఉంటే హజ్ యాత్ర చేయాలి

3 /5

180 దేశాల్నించి హాజీలు సౌదీ అరేబియా ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ప్రకారం మొదటి రోజున 15 లక్షల కంటే ఎక్కువే ముస్లింలు చేరుకున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్నించి హాజీలు మక్కా చేరుకున్నారు. 

4 /5

హజ్ యాత్రకు లక్షలాదిగా ముస్లింలు జూన్ 13వ తేదీ గురువారం హజ్ మొదటి రోజున పెద్ద సంఖ్యలో ముస్లిం భక్తులు హజ్ యాత్ర సందర్భంగా కాబా సందర్శించుకున్నారు.

5 /5

హజ్ యాత్ర ప్రారంభం మక్కాలో హజ్ యాత్ర జూన్ 13వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 14-జూన్ 19 మధ్యలో హజ్ యాత్ర ఉంటుంది.