School Half Days in Telangana: విద్యార్థులకు కీలక అప్డేట్ ఇక మరో నాలుగు రోజుల నుంచి స్కూళ్లు కేవలం సగంపూటనే నడవనున్నాయి. నవంబర్ 6 నుంచి కేవలం మధ్యాహ్నం 1 గంటల వరకే స్కూళ్లు పనిచేయనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
విద్యార్థులకు ఇటీవల వరుసగా భారీవర్షాలు, పండుగ నేపథ్యంలో భారీగానే సెలవులు వచ్చాయి. గత రెండు నెలలుగా ఇలానే జరుగుతోంది. ప్రస్తుతం నవంబర్ 6 నుంచి కూడా కేవలం ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. దీనికి అసలు కారణం తెలుసుకుందాం.
ఈ నెల 6వ తేదీ నుంచి మరో మూడు వారాల వరకు రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వారు దాదాపు 80 వేల మంది ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చింది.
కులగణనలో 36,559 మంది ఎస్జీటీలతోపాటు 3414 ప్రైమరీ స్కూలు హెడ్ మాస్టర్లకు కూడా వినియోగించుకోనుంది. ఈ క్రమంలో విద్యార్థులకు కేవలం ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ఇందులో ఎస్జీటీలు ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో పనిచేసేవారికి మాత్రం మినహాయింపు లభించింది.
నవంబర్ 6 నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే క్లాసులు జరుగుతాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్థులు తిరిగి ఇంటికి చేరుకుంటారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విధివిధానాలను విడుదల చేసింది.
ఈ కులగణనలో అదనంగా 6256 మంది ఎంఆర్‌ఎస్‌ఎస్ స్టాఫ్‌తోపాటు రెండు వేల మంది ఎంపీడీఓ, జెపీడీఓ మంత్రిత్వ శాఖ, క్లర్క్, టైపిస్టు, రికార్డు అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంట్, ఎయిడెడ్ స్కూలు సీనియర్ అసిస్టెంటులు కూడా ఈ సర్వేలో పాల్గొననున్నారు.
విద్యాశాఖకు చెందిన 50 వేలమంది నాన్ టీచింగ్ (కేజీబీవీ, యూఆర్ఎస్), అకౌటెంట్స్, ఏఎన్ఎం, పీఈటీ ఉద్యోగులను కూడా ఇంటింటి సర్వేలో భాగం కానున్నారు.