Hangover: ఫుల్‌గా తాగి హ్యాంగోవర్‌తో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాతో మొత్తం దిగిపోద్ది..

Hangover Homeremedies: న్యూ ఇయర్‌ వేడుకలు నిన్న ఘనంగా జరుపుకున్నారు. పార్టీలు, ఈవెంట్లతో దద్దరిల్లింది. పార్టీ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది మందు. ఇది కచ్చితంగా ఉండాల్సిందే. మద్యం లేనిదే ఏ పార్టీలు జరగవు. అయితే, ఫుల్‌గా మద్యం తాగిన మరుసటి రోజు చాలామంది హ్యాంగోవర్‌తో బాధపడుతుంటారు. ఈ ఇంటి చిట్కాతో మొత్తం దిగిపోతుంది..
 

1 /5

కొత్త సంవత్సరం వేడుకలు హ్యాపీగా జరుపుకున్నారు. అయితే, మరుసటి రోజు న్యూ ఇయర్‌ ఎఫెక్ట్ కనిపిస్తుంది.  ఫుల్‌గ మద్యం తాగుతారు కాబట్టి హ్యాంగోవర్‌తో బాధపడతారు. నిద్ర లేవగానే ఈ సమస్య మొదలవుతుంది.  

2 /5

కొన్ని ఇంటి చిట్కాలు పాటించి ఈ హ్యాంగోవర్‌ సమస్యకు చెక్ పెట్టొచ్చు.  ముఖ్యంగా హ్యాంగోవర్‌ లక్షణాలు తలనొప్పి, అజీర్తి, కడుపునొప్పి, నీరసం, వికారం వంటివి కనిపిస్తాయి.  

3 /5

ఇలాంటి సమయంలో ఇంటి చిట్కాలతో చెక్‌ పెట్టండి. తలకు వేడి చేసిన ఆయిల్‌ పెట్టాలి. ఆయిల్‌ వేడి చేసి ఆ తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. దీన్ని తలకు మసాజ్‌ చేయాలి. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది.  

4 /5

శొంఠి, యాలకులు వేసుకుని టీ తయారు చేసుకోవాలి. ఇది కూడా త్వరగా హ్యాంగోవర్‌ తగ్గేలా చేస్తుంది.  మీ మెదడు కూడా రిలాక్స్‌ అవుతుంది.   

5 /5

ఈ సమయంలో నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఏవైనా పండ్లు  కూడా తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మజ్జిగ కూడా మంచిది. నిమ్మరసం జత చేసి మజ్జిగ తీసుకోవాలి. దీంతో యాసిడిటీ, వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది.