Happy Independence Day Wishes 2024: ఒళ్లు గగుర్లు పుట్టించే దేశభక్తి కోట్స్.. శుభాకాంక్షలు..


Happy Independence Day Wishes 2024: భారతీయులకు దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే . దీనికి ప్రతీకగానే ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఊరూరు పల్లె పల్లెనా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

1 /11

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుకలను దాదాపు ఐదు నుంచి ఏడు రోజుల పాటు జరుపుకునే వారు అయితే కాలం మారుతున్న కొద్ది ఈ స్వాతంత్ర వేడుకల్లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు అంతా ఆగస్టు 15వ తేదీ ఈరోజే జరుపుకుంటున్నారు.

2 /11

ఈ ఆగస్టు 15వ తేదీ రోజున జరుపుకునే స్వాతంత్ర దినోత్సవాన్ని కొన్ని చోట్ల ఎంతో ఘనంగా జరుపుకుంటారు అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగను ప్రతి ఏడు గుర్తుండిపోయేలా మీ కోసం మేము కొన్ని శుభాకాంక్షలు అందించబోతున్నాం. 

3 /11

ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ఇష్టమైన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇలా సులభంగా షేర్ చేయండి.  

4 /11

ఇంతటి ప్రత్యేకమైన రోజు రావడానికి ఎంతో కృషి చేసి ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. స్వాతంత్రం తెచ్చిన ప్రతి ఒక్క అమరవీరుడిని గుర్తుంచుకుంటూ.. వారి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

5 /11

ప్రతి ఇంట్లో ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టాలని కోరుకుంటూ.. ప్రతి భారతీయునికి పేరుపేరునా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

6 /11

ఈ స్వాతంత్రం కొన్ని లక్షల మంది రక్త బలిదానాల కారణంగా వచ్చింది.. కాబట్టి ఇలాంటి రోజును ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని.. వారి సేవల గురించి తెలియజేస్తూ.. వారు సూచించిన మార్గంలోనే నడవాలని కోరుకుంటూ.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.   

7 /11

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

8 /11

అసాధ్యమైన స్వాతంత్రయాన్ని.. సుసాధ్యం చేసిన ప్రతి అమరవీరుడికి పాదాభివందనాలు.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

9 /11

భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఓ శక్తివంతమైన పౌరుడే.. మనమంతా భారత దేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమే.. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

10 /11

మన భారతదేశం ఎంతో గొప్పది.. ఈ గొప్ప దేశాన్ని మున్ముందు మరింత అభివృద్ధి చేయడమే మన లక్ష్యం.. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

11 /11

మనమంతా ఏకమై భారత్ ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం.. జై జవాన్ జై కిసాన్..