Happy Rakhi 2024 In Telugu: రాఖీ పండగ ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ఫొటోస్, కోట్స్..

Happy Raksha Bandhan Wishes And Photos: పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం రాఖీ పండగను శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటాము. ఈ ఎంతో ప్రత్యేకమైన రోజున సోదరులపై ప్రేమ అనురాగాలు తెలిపేందుకు తమ సోదరీమణులు రాఖీని కడుతూ ఉంటారు.. ఈ సాంప్రదాయం దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 19వ తేదీన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు తమ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముల్లకు మేలు జరగాలని కోరుకుంటూ ఇలా రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేయండి.

  • Aug 18, 2024, 22:35 PM IST
1 /10

నీతో ఉన్న ప్రతి క్షణం ప్రత్యేకం ఓ నా ముద్దుల అన్నయ్య... రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

2 /10

ఈ పవిత్రమైన రోజు మన బంధం మరింత బలపడాలని కోరుకుంటాను.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

3 /10

చెల్లెలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి.. భరోసా ఇవ్వాలని అన్న పడే ఆరాటం. వీటికన్నా స్వచ్చమైన ప్రేమ ఏమైనా ఉంటుందా.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

4 /10

అన్నయ్యా.. నీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ప్రేరణ.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.  

5 /10

నువ్వే నాకు రక్ష, ఎల్లలి ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతలు, నేను కలకాలం చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరి.. తన సోదరుడి రక్త సంబంధాన్ని రక్షాబంధంతో ముడివేస్తూ కోరుకుంటుంది..రాఖీ పండుగ శుభాకాంక్షలు..

6 /10

అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, అన్నా చెల్లెల్ల బంధం..రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.  

7 /10

చిగురాకు వర్ణంలో.. చిరుకోయిల సంగీతంలా, సుప్రభాత గీతికలో.. సుమ పరిమళ పల్లవిలా, వసంతమై నవ్వుకోవమ్మా! చిన్నారి చెల్లెమ్మా!.. రాఖీ పండుగ శుభాకాంక్షలు..

8 /10

ఒక్క తల్లి బిడ్డలం కాకపోయినా, అంతకంటే ఎక్కువ అనురాగాన్ని పంచిన ప్రియ సోదరికి.. రక్షాబంధన్ శుభాకాంక్షలు.

9 /10

అన్నంటే అమ్మలో మొదటి సగం, నాన్నలో రెండవ సగం.. అన్నా చెల్లెల్ల అనురాగానికి గుర్తే రక్షాబంధన్.. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.  

10 /10

చిరునవ్వుకి చిరునామానివి, మంచి మనసుకు మారు రూపానివి, మమతలకు ప్రాకారానివి, అప్యాయతకు నిలువెత్తు రూపానివి! రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.