పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఓం నమశివాయ నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శైవాలయాలకు నిన్నటినుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. శైవక్షేత్రాలైన శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ రాజన్న, వేయి స్తంభాల గుడి మొదలైన ఆలయాలను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మహా శివరాత్రి పర్వదినాన రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున శివుడిని ప్రార్థిస్తున్న భక్తుడు. (Photo Courtesy: Twitter)
తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిట లాడుతూన్న గోదావరి గట్లు. స్నానం ఆచరించి దేవుడుని దర్శించుకుంటున్న భక్తులు (Photo Courtesy: Twitter)
మహాశివరాత్రి పర్వదినాన శివలింగాల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శివలింగం (Photo Courtesy: Twitter)
గుజరాత్‌లో కొలువైన ప్రసిద్ద నాగేశ్వర జ్యోతిర్లింగం (Photo Courtesy: Twitter)
మహా శివరాత్రి రోజు నందీశ్వరుడి సమేతంగా ఉన్న శివుడుని దర్శించుకోవడం శుభసూచకం (Photo Courtesy: Twitter)
పీఠేశ్వర మఠం శివాలయంలో పూజలు నిర్వహిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్
వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామికి పాలాభిషేకం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
శుక్రవారం వేయి స్తంభాల గుడిని దర్శించుకున్న ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌లు మహా శివరాత్రి రోజున రుద్రేశ్వరుడికి పాలాభిషేకం చేశారు. పరమ శివుడు రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడాలని ఆకాంక్షించారు.
వేయి స్తంభాల గుడిని దర్శించుకుని పూజలు చేసిన తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
జార్ఖండ్ లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం సన్నిధిలో భక్తుల సందడి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
పశుపతినాథ్ ఆలయంలో శివరాత్రి (Photo Courtesy: Twitter)
(Photo Courtesy: Facebook)