Health Benefits: ఉల్లిపాయలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. కేశాల సంరక్షణకు ఉల్లి రసం చాలా ప్రయోజనకరం. ఇదే ఉల్లిరసాన్ని రోజు పరగడుపున తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో వింటే నోరెళ్లబెట్టడం ఖాయం
ఉల్లిరసం అనేది ఫ్యాట్ ఫ్రీ డ్రింక్. రోజూ ఇది తాగడం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.
ఉల్లిరసంలో ఇన్సులిన్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
బలహీనమైన ఇమ్యూనిటీ కారణంగా త్వరగా వివిధ రకాల వ్యాధులు సోకుతుంటాయి. రోజూ పరగడుపున ఉల్లిరసం తాగడం అలవాటు చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ప్రతిరోజూ పరగడుపున ఉల్లిరసం తాగితే హెయిర్ ఫాల్ సమస్యకు ఇట్టే చెక్ పెట్టవచ్చు.
ఉల్లిరసంలో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. దీని కారణంగా మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.