Fitness Tips: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. ఇప్పటికీ ఫిట్ అండ్ స్లిమ్ బాడీ ఆమె సొంతం. ఫిట్నెస్ విషయంలో ఆమెను మించినోళ్లు లేరనే చెప్పాలి. ఎందుకంటే 48 ఏళ్ల వయస్సులో కూడా అదే ఫిజిక్ మెయింటైన్ చేయడం, ఇప్పటికీ చర్మం యౌవనంగా మిళమిళలాడటం ఆమెకే సొంతం.
Fitness Tips: అందుకే శిల్పాశెట్టి ఫిట్నెస్ రహస్యంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ వయస్సులో కూడా ఇంత క్యూట్ గా , ఫిట్ అండ్ స్లిమ్ గా , యౌవనంగా ఉంటుందంటే ఆమె తీసుకునే డైట్ అలాంటిది. దీనికితోడు క్రమం తప్పకుండా చేసే యోగాసనాలు. ఆ డైట్ ఏంటో తెలుసుకుందాం..
ఓట్స్ రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. శిల్పా శెట్టి కూడా బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తీసుకోవడం ఇష్టపడుతుంది.
జ్యూస్ పండ్ల జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదే జ్యూస్ ను ఉదయం అల్పాహారంగా తీసుకుంటే శరీరం ఎప్పటికీ ఫిట్ అండ్ స్లిమ్ గా ఉంటుంది.
గ్రీన్ టీ గ్రీన్ టీ అనేది బరువును నియంత్రించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని చాలాసార్లు నిరూపితమైంది. రోజూ బ్రేక్ ఫాస్ట్ తరువాత శిల్పాశెట్టికి గ్రీన్ టీ తాగడం అలవాటు.
అవకాడో శిల్పాశెట్టికి ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అవకాడో తినడం అలవాటు. శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో అవకాడో పాత్ర కీలకం.
అంజీర్ 48 ఏళ్ల వయస్సులో కూడా శిల్పాశెట్టి ఫిట్ అండ్ స్లిమ్ ఫిజిక్ తో ఉందంటే రోజూ ఉదయం అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకుంటుంది.