Male Infertility: స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ సమస్యగా మారిందా, ఈ 5 సూపర్‌ఫుడ్స్ తింటే చాలు

Male Infertility: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు లేదా ఒత్తిడి, ఆందోళన ఇలా వివిధ కారణాలతో పురుషుల్లో సంతాన సాఫల్యత సమస్యగా మారుతోంది. అంటే మేల్ ఇన్‌ఫెర్టిలిటీ. కారణం స్పెర్మ్ కౌంట్ తక్కువ లేదా మొబిలిటీ లేకపోవడమే. ఈ సమస్యకు పరిష్కారమేంటి..

Male Infertility: ఆధునిక పోటీ ప్రపంచంలో ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస్యల్లో పురుషుల్లో స్బెర్మ్ కౌంట్ ఒకటి. ఒకవేళ ఎవరి సీమెన్‌లో అయినా మిల్లీమీటర్‌కు 15 మిలియన్ల కంటే తక్కువ ఉంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్టు భావిస్తారు. అయితే కొన్ని రకాల సూపర్‌ఫుడ్స్‌తో ఈ సమస్యకు ఇట్టే పరిష్కారం లభిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 /5

వాల్‌నట్స్ వాల్‌నట్స్‌లో విటమిన్ ఎ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచేందుకు దోహదపడతాయి. రోజూ క్రమం తప్పకుండా 1-2 తీసుకుంటే చాలు..

2 /5

ఆనపకాయ గింజలు ఆనపకాయ గింజల్లో జింక్, విటమిన్ ఎ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , పైటోస్టెరోల్ ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ క్వాలిటీగా ఉండేట్టు చేస్తాయి.

3 /5

ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ సమస్య తీరడమే కాకుండా లైంగిక సామర్ధ్యం కూడా పెరుగుతుంది. 

4 /5

మెంతులు మెంతి గింజల్లో ఫైటో ఈస్ట్రోజెన్ ఇతర పోషకాలు ఉండటం వల్ల స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ రెండూ పెరుగుతాయి. మెంతి గింజల్ని రాత్రి పూట నీళ్లలో నానబెట్టుకుని ఉదయం ఆ నీళ్లతో సహా తీసుకోవాలి. 

5 /5

అశ్వగంధ ఇదొక ఆయుర్వేద మూలిక. స్పెర్మ్ కౌంట్ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్నిస్తుంది. ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. అశ్వగంధ పౌడర్ గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.